కరన్‌కోట్ ఉత్తమ పోలీస్‌స్టేషన్: డీఐజీ | DIG Akun Sabharwal Inspects karan kota police station in tandur | Sakshi
Sakshi News home page

కరన్‌కోట్ ఉత్తమ పోలీస్‌స్టేషన్: డీఐజీ

Dec 27 2016 12:23 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా తాండూర్ మండలంలోని కరన్‌కోట్ పోలీస్ స్టేషన్‌ను డీఐజీ అకున్ సబర్వాల్ మంగళవారం ఉదయం తనిఖీ చేశారు.

తాండూర్‌రూరల్: రంగారెడ్డి జిల్లా తాండూర్ మండలంలోని కరన్‌కోట్ పోలీస్ స్టేషన్‌ను డీఐజీ అకున్ సబర్వాల్ మంగళవారం ఉదయం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల పెరేడ్‌ను తిలకించారు. రాష్ట్రంలోని ఏడు ఉత్తమ పోలీస్‌స్టేషన్లలో కరన్‌కోట్ కూడా ఒకటని చెప్పారు. స్టేషన్ నిర్వహణ, క్రమశిక్షణ, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాల్లో సిబ్బంది పనితీరును మెచ్చుకున్నారు. అనంతరం ఆయన రికార్డులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement