రాజ్యసభలో 'భూ' రగడ | uproar in rajyasabha on ordinance | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో 'భూ' రగడ

Feb 24 2015 11:55 AM | Updated on Sep 2 2017 9:51 PM

ముందనుకున్నట్లుగానే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆరంభంలోనే అధికార పార్టీకి ప్రతిపక్షాల నుంచి కాక మొదలైంది. రెండో రోజు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు గందరగోళానికి వేదికయ్యాయి.

ముందనుకున్నట్లుగానే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆరంభంలోనే అధికార పార్టీకి ప్రతిపక్షాల నుంచి కాక మొదలైంది. రెండో రోజు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు గందరగోళానికి వేదికయ్యాయి. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలు అధికార పార్టీపై పలు ప్రశ్నలు సందించారు. ముఖ్యంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న భూసేకరణ బిల్లును తాము ఏమాత్రం ఆమోదించేది లేదని కాంగ్రెస్, జేడీయూ ఇతర విపక్షాలు ముక్త కంఠంగా తేల్చి చెప్పాయి. 

                   మంగళవారం సభ ప్రారంభమవగానే స్పీకర్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాలను ప్రవేశపెట్టారు. అదే సమయంలో భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చను చేపట్టాలని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును ఆయన తిరస్కరించారు. దీంతో తక్షణమే  బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్  డిమాండ్ చేసింది.  బీఎస్సీ, తృణమూల్, వామపక్షాలు కాంగ్రెస్కు జతకలిశాయి.  ఆందోళన విరమించాల్సిందిగా స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అధికారం ఇచ్చాం కదా అని ఇష్టమొచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని జేడీయూ అధినేత శరద్ యాదవ్ అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ ఇవి రైతులకోసం కాకుండా పారిశ్రామిక వేత్తల కోసం తెస్తున్న ఆర్డినెన్స్ అని తీవ్రంగా ఆరోపించారు.

        దీంతో ఆర్డినెన్స్లపై ప్రశ్నించే హక్కు  కాంగ్రెస్కు లేదని జైట్లీ విరుచుకుపడ్డారు. ఒక్కో ఆర్డినెన్స్ మూడుసార్లు కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో బీజేపీ సహకరించకపోవడవల్లే అలా జరిగిందని కాంగ్రెస్ నేత ఆనంద్శర్మ అన్నారు. మరోవైపు లోక్ సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.  మధ్యాహ్నం రెండుగంటలకు భూసేకరణ ఆర్డినెన్స్పై చర్చ జరిగే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement