టాలీవుడ్ తెరపై శ్రీదేవి, కోన వెంకట్ కథకు గ్రీన్ సిగ్నల్! | Sridevi to act in trilingual movie.. Green signal to Kona Venkat story | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ తెరపై శ్రీదేవి, కోన వెంకట్ కథకు గ్రీన్ సిగ్నల్!

Sep 17 2013 8:08 PM | Updated on Sep 1 2017 10:48 PM

టాలీవుడ్ తెరపై శ్రీదేవి, కోన వెంకట్ కథకు గ్రీన్ సిగ్నల్!

టాలీవుడ్ తెరపై శ్రీదేవి, కోన వెంకట్ కథకు గ్రీన్ సిగ్నల్!

తెలుగు తెరపై శ్రీదేవి కనిపించి చాలా సంవత్సరాలే అయింది. అయితే తెలుగు ప్రేక్షకులకు త్వరలోనే దగ్గరయ్యేందుకు శ్రీదేవి త్రిభాష చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు సమాచారం

తెలుగు తెరపై శ్రీదేవి కనిపించి చాలా సంవత్సరాలే అయింది. అయితే తెలుగు ప్రేక్షకులకు త్వరలోనే దగ్గరయ్యేందుకు శ్రీదేవి త్రిభాష చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు సమాచారం. ప్రముఖ తెలుగు సినీ రచయిత కోన వెంకట్ చెప్పిన కథకు శ్రీదేవి తెగ నచ్చేయడంతో వెంటనే ఓకే చెప్పినట్టు ట్విటర్ లో ట్వీట్ చేశారు. శ్రీదేవితోపాటు భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ క నచ్చడంతో త్రిభాష చిత్రంగా రూపొందించేందుకు మొగ్గు చూపుతున్నట్టు కోన వెంకట్ వెల్లడించిన సమాచారం. 
 
శ్రీదేవిని కలిసి కథ చెప్పే అవకాశం రావడం గొప్ప అదృష్టం. తాను తన కథను అంగీకరించింది. బోని కపూర్ మూడు భాషల్లో రూపొందించనున్నారు అని కోన వెంకట్ తెలిపారు. ఆ చిత్రానికి దర్శకులు ఎవరన్నది,  ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని అన్నారు. 
 
సుదీర్ఘ విరామం తర్వాత శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం విమర్శల ప్రశంసలందుకుంది. ఇంగ్లీష్ వింగ్లీష్ తర్వాత ఎన్నో అవకాశాలను వదులుకున్న శ్రీదేవి.. కోన వెంకట్ కథకు ఓకే చెప్పడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement