మా పిల్లలకు రిజర్వేషన్లు వదులుకున్నా | Our children had left the reservation:- Praveen Kumar IAS | Sakshi
Sakshi News home page

మా పిల్లలకు రిజర్వేషన్లు వదులుకున్నా

Apr 30 2016 2:10 AM | Updated on Sep 15 2018 3:07 PM

మా పిల్లలకు రిజర్వేషన్లు వదులుకున్నా - Sakshi

మా పిల్లలకు రిజర్వేషన్లు వదులుకున్నా

మా పిల్లలకు విద్య, ఉద్యోగం, ఇతర రంగాలలో ఎస్సీ రిజర్వేషన్‌ను వదులుకున్నానని టీఎస్‌డబ్ల్యూర్‌ఈ ఐఎస్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.

ఐఏఎస్ ప్రవీణ్‌కుమార్
 
ఉస్మానియా యూనివర్సిటీ: మా పిల్లలకు విద్య, ఉద్యోగం, ఇతర రంగాలలో ఎస్సీ రిజర్వేషన్‌ను వదులుకున్నానని టీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల పొలిటికల్ సైన్స్ విభాగంలో కొనసాగుతున్న అడ్వాన్సుడ్ స్టడీస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్: సామాజిక న్యా యం, ప్రజాస్వామ్యం, భాగస్వామ్యం అనే అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమానికి కోఆర్డినేటర్ ప్రొ.కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా డాక్టర్ ప్రవీణ్‌కుమార్, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పేదరిక నిర్మూళనకు ఎంతోకాలంగా రిజర్వేషన్లు అమలవుతున్నా పేదరికం పోవడం లేదన్నారు. ప్రభుత్వంతో పాటు గతంలో రిజర్వేషన్లు పొంది నేడు ఉన్నత స్థితిలో ఉన్నవారు సైతం కృషి చేస్తే పేదరిక నిర్మూళన సాధ్యమన్నారు. మా ఇద్దరు పిల్లలను రిజర్వేషన్లు లేకుండా చదివిస్తున్నానని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ అన్ని రంగాలలో అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. కార్యక్రమంలో ప్రొ.రవీందర్, పరిశోధన విద్యార్థి కోట రాజేష్, సుదర్శన్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement