కుటీర పరిశ్రమలు పునరుద్ధరిస్తాం | Draft policy for MSME sector in 3-4 months: Kalraj Mishra | Sakshi
Sakshi News home page

కుటీర పరిశ్రమలు పునరుద్ధరిస్తాం

Aug 27 2014 1:50 AM | Updated on Mar 29 2019 9:24 PM

కుటీర పరిశ్రమలు పునరుద్ధరిస్తాం - Sakshi

కుటీర పరిశ్రమలు పునరుద్ధరిస్తాం

దేశంలో కుటీర పరిశ్రమలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని కేంద్ర సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్‌ఎంఈ) మంత్రి కల్‌రాజ్ మిశ్రా అన్నారు.

 కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రా
 
 హైదరాబాద్: దేశంలో కుటీర పరిశ్రమలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని కేంద్ర సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల శాఖ(ఎంఎస్‌ఎంఈ) మంత్రి కల్‌రాజ్ మిశ్రా అన్నారు. మంగళవారం సనత్‌నగర్‌లోని ‘ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్స్’ (ఫెట్సియా) ఎస్‌ఎస్‌ఐ సెంటర్ నూతన భవన సముదాయం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్  మీడియం ఎంటర్‌ప్రైజెస్ (నిమ్స్‌మే)లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఏవియేషన్, హెచ్‌ఏఎల్ వంటి సంస్థలకు కావాల్సిన ఉత్పత్తులను అందించడంలో ఎంఎస్‌ఎంఈ ముందుందన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు, వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృతనిశ్చయంతో ఉన్నాయన్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి అన్నీ సవ్యంగా ఉంటే 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య కన్వీనర్ రాజ్ మహేందర్‌రెడ్డి, నిమ్స్‌మే డెరైక్టర్ జనరల్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, ఫెట్సియా అధ్యక్షుడు జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


 దేశ ప్రగతి కోసం పనిచేయండి
 
 బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రి కల్‌రాజ్ మిశ్రా సూచన
 
 సాక్షి, హైదరాబాద్:  కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి, దేశ ప్రగతికి కృషి చేయాలని కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రా బీజేపీ కార్యకర్తలకు సూచించారు. అధికారిక పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన విద్యాసాగర్‌రావును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాజీ గవర్నర్ రామారావు, మురళీధరరావు,  ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Draft policy for MSME sector in 3-4 months: Kalraj Mishra  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement