ఈ యేటి మేటి చిత్రం.. ఆషికీ 2

ఈ యేటి మేటి చిత్రం.. ఆషికీ 2


హిందీలో అత్యధికంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలేవో తెలుసా? దీనికి ప్రమాణాలేంటని అనుకుంటున్నారా? వీక్షకులు గూగుల్లో ఎక్కువగా ఏయే సినిమాలను సెర్చ్ చేశారన్నదే ఇందుకు అతిపెద్ద ప్రమాణం. దాని ప్రకారం చూసుకుంటే, అగ్రస్థానంలో 'ఆషికీ 2' నిలిచింది. ఇది రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా.ఇందులో ప్రధానంగా 'అప్నే కరమ్ కీ కర్ అదాయే' అంటూ వచ్చే మొదటిపాట యూట్యూబ్లో ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తోంది. వివిధ రకాలుగా దీన్ని ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది యూట్యూబ్లో చూశారు. ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా, భూషణ్ కుమార్, ముఖేష్ భట్ నిర్మించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై ఎక్స్ప్రెస్, క్రిష్ 3, ధూమ్ 3, హిమ్మత్వాలా, రేస్ 2, ఏబీసీడీ, భాగ్ మిల్కా భాగ్, దబాంగ్ 2, మద్రాస్ కేఫ్ నిలిచాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top