'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం' | ysr congress party to solve kolleru lake problem, says thota chandrasekhar | Sakshi
Sakshi News home page

'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం'

Apr 20 2014 1:53 PM | Updated on Aug 14 2018 4:21 PM

'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం' - Sakshi

'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం'

తమ పార్టీ అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఏలూరు వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ హామీయిచ్చారు.

దెందులూరు: తమ పార్టీ అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఏలూరు వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ హామీయిచ్చారు. కొల్లేరు ప్రజల జీవన గతులు మెరుగుపరిచేందుకే ఈ అంశాన్ని వైఎస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.

చంద్రబాబు వల్లే కొల్లేరు ప్రజలకు ఈ దుస్థితి దాపురించిందన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గంలోని గుడివాకలంక, పైడిచింతపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement