కాంట్రాక్ట్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలి | to regularize the Contract employees | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలి

Aug 6 2016 9:54 PM | Updated on Sep 5 2018 4:22 PM

కాంట్రాక్ట్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలి - Sakshi

కాంట్రాక్ట్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలి

మిర్యాలగూడ : విద్యుత్‌ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ 1104 యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రెడ్డి అన్నారు.

మిర్యాలగూడ : విద్యుత్‌ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని తెలంగాణ  ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ 1104 యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక నూకల వెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హా ల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌శాఖలో ఖాళీగా ఉన్న 30 వేల పోస్టులు భర్తీ చేయాలని కోరారు.  ఇంజనీరింగ్‌ పోస్టులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల పని భారం పెరుగుతుందన్నారు. ఉద్యోగంలో ఉండి ప్రమాదంలో చనిపోయిన సిబ్బందికి కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌పీడీసీఎల్‌లో 1,175 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి మంత్రి జగదీశ్‌రెడ్డి సహకరించారన్నారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు డిస్కం అద్యక్షులు వేణు, డిస్కం కార్యదర్శి సాయిబాబు, డివిజన్‌ కార్యదర్శి కాతోజు సోమాచారి, మేరెడ్డి రాంరెడ్డి, సలీం పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement