విద్యార్థి ఆత్మహత్య | student succide | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఆత్మహత్య

Aug 15 2016 11:50 PM | Updated on Nov 9 2018 5:02 PM

విద్యార్థి ఆత్మహత్య - Sakshi

విద్యార్థి ఆత్మహత్య

మండలంలోని రామరాజులంక గ్రామంలో ఆదివారం రాత్రి మేడిచర్ల లక్ష్మీపతి(18) అనే విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బెదిరింపుల వల్లే లక్ష్మీపతి ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని బంధువులు ఆందోళన చేపట్టారు. దాంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది

మలికిపురం:
మండలంలోని రామరాజులంక గ్రామంలో ఆదివారం రాత్రి మేడిచర్ల లక్ష్మీపతి(18) అనే విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బెదిరింపుల వల్లే లక్ష్మీపతి ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని బంధువులు ఆందోళన చేపట్టారు. దాంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మోటార్‌ సైకిల్‌ విషయమై నెల్లాళ్లుగా అదే గ్రామానికి చెందిన దేశినీడి ప్రభాకర్, లక్ష్మీపతికి    మధ్య గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ప్రభాకర్‌ బెదిరించడం వల్లే లక్ష్మీపతి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు తెలిపారు. పురుగు మందు తాగిన లక్ష్మీపతిని బంధువులు అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం అనంతరం సోమవారం మృత దేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చారు. దేశినీడి ప్రభాకర్‌ ఇంటి ముందు లక్ష్మీపతి మృత దేహం ఉంచి అతని బంధువులు ఆందోళన చేపట్టారు. దాంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అమలాపురం డీఎస్పీ అంకయ్య, పోలీసులు అక్కడకు చేరుకుని చర్చలు జరిపారు.  చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement