దూర విద్య పరీక్ష ఫీజు కట్టని ప్రిన్సిపాల్‌ | principal donot paid the exam fee | Sakshi
Sakshi News home page

దూర విద్య పరీక్ష ఫీజు కట్టని ప్రిన్సిపాల్‌

Sep 3 2016 6:33 PM | Updated on Oct 1 2018 5:40 PM

ఎల్‌డీసీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్న విద్యార్థులు - Sakshi

ఎల్‌డీసీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్న విద్యార్థులు

ఇల్లంతకుంట : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ దూరవిద్య కేంద్రం రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 130 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా వారి నుంచి కళాశాల ప్రిన్సిపాల్‌ లింగం, ఎల్‌డీసీ రవి రూ.4 లక్షల వరకు పరీక్ష ఫీజు వసూలు చేశారు.

  • హాల్‌టికెట్ల కోసం విద్యార్థుల ఆందోళ
  • పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
  • ఇల్లంతకుంట : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ దూరవిద్య కేంద్రం రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 130 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా వారి నుంచి కళాశాల ప్రిన్సిపాల్‌ లింగం, ఎల్‌డీసీ రవి రూ.4 లక్షల వరకు పరీక్ష ఫీజు వసూలు చేశారు. అయితే ఈ డబ్బులను ఎస్డీఎల్‌ఈసీలో జమ చేయకపోవడంతో డిగ్రీ దూరవిద్య పరీక్ష కోసం సిద్ధమైన విద్యార్థులకు హాల్‌టికెట్లు రాలేదు. శనివారం పరీక్ష ఉందని పత్రికల్లో చూసి కళాశాలకు చేరుకున్న విద్యార్థులు హాల్‌టికెట్ల కోసం ఎల్‌డీసీ రవి, ప్రిన్సిపాల్‌ లింగంను నిలదీశారు. హాల్‌టికెట్లు ఇచ్చేది లేదని చెప్పడంతో కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇచ్చిన పరీక్ష ఫీజు ఇద్దరు కలిసి వాడుకున్నారని, ఇప్పుడు హాల్‌టికెట్లు అడిగితే బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. హాల్‌టికెట్లు రాని విద్యార్థులందరూ ప్రిన్సిపాల్, ఎల్‌డీసీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. డిసెంబర్‌లో పరీక్ష రాయిస్తానని ప్రిన్సిపాల్‌ చెప్పగా అసలు మొదలు పరీక్ష రాయకుండా సప్లమెంటరీ పరీక్ష ఎలా రాయిస్తారని, తాము ఇచ్చిన డబ్బులన్నీ వాపస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తర్వాత ప్రిన్సిపాల్‌ లింగం, ఎల్‌డీసీ రవి విద్యార్థులు ఇచ్చిన డబ్బులన్నీ వాపస్‌ ఇస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement