వరంగల్ ఖమ్మం రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ది చేయాలని మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఖమ్మం నుంచి కోదాడ, అదిలాబాద్ జిల్లాలో చెన్నూరు నుంచి గోదావరిఖని మీదుగా కాళేశ్వరం, చిట్యాల, పరకాల మీదుగా రేగొండ, కొడవటంచ, బాగిర్థిపేట వరకు జాతీయ రహదారిగా అభివ
జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలి
Sep 21 2016 1:01 AM | Updated on Sep 4 2017 2:16 PM
హన్మకొండ: వరంగల్ ఖమ్మం రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ది చేయాలని మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఖమ్మం నుంచి కోదాడ, అదిలాబాద్ జిల్లాలో చెన్నూరు నుంచి గోదావరిఖని మీదుగా కాళేశ్వరం, చిట్యాల, పరకాల మీదుగా రేగొండ, కొడవటంచ, బాగిర్థిపేట వరకు జాతీయ రహదారిగా అభివృద్ది చేయాలని కోరారు. వారి వెంట పార్టీ నాయకుడు వి.పాపయ్య ఉన్నారు.
Advertisement
Advertisement