‘నండూరి’కి పోలీస్‌ పగ్గాలు | NANDURI AS A DGP OF AP | Sakshi
Sakshi News home page

‘నండూరి’కి పోలీస్‌ పగ్గాలు

Jul 21 2016 9:39 PM | Updated on Sep 4 2017 5:41 AM

‘నండూరి’కి పోలీస్‌ పగ్గాలు

‘నండూరి’కి పోలీస్‌ పగ్గాలు

జిల్లాకు విశేషమైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో రెండో అత్యున్నత స్థానంగా భావించే డీజీపీ పదవి జిల్లా వాసిని వరించింది. ఒంగోలు నగరానికి చెందిన నండూరి సాంబశివరావును డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

  •  ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న నండూరి సాంబశివరావు
  •  రేపు పదవీ విరమణ చేయనున్న డీజీపీ జేవీ రాముడు 
  • ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న నండూరి..
  • నండూరి.. ఒంగోలు నగరం మిరియాలపాలెం వాసి
  •   
    ఒంగోలు క్రైం : జిల్లాకు విశేషమైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో రెండో అత్యున్నత స్థానంగా భావించే డీజీపీ పదవి జిల్లా వాసిని వరించింది. ఒంగోలు నగరానికి చెందిన నండూరి సాంబశివరావును డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాకు మరోమారు గౌరవ స్థానం లభించినట్లయింది. రాష్ట్ర పరిపాలనలో అత్యున్నత స్థానమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఇటీవల కాలం వరకు జిల్లా వాసి ఐవైఆర్‌ కృష్ణారావు కొనసాగి పదవీ విరమణ పొందారు. ఆయన పొన్నలూరు మండలానికి చెందిన వారు. రాష్ట్రంలో అత్యున్నత పదవులను జిల్లాకు చెందిన వారు అలంకరించడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న జాస్తి వెంకటరాముడు Ô¶ నివారం(ఈ నెల 23న) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన డీజీపీగా నండూరి సాంబశివరావు బాధ్యతలు చేపట్టనున్నారు. 
    నండూరి నేపథ్యం.. 
    1984 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన నండూరి ఆంధ్రా కేడర్‌లో నియమితులయ్యారు. ఈయన ఒంగోలు నగరంలోని మిరియాలపాలెం వాసి. సాంబశివరావు తండ్రి రామకోటయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి సూరమ్మ గృహిణి. వీరికి నలుగురు సంతానంలో సాంబశివరావు ఆఖరివాడు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు ఒంగోలులో చదువుకున్నారు. 1967–72 వరకు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య, 1972–74 వరకు శర్మ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివారు. అనంతరం 1974–79 వరకు ఆంధ్రా యూనివర్శిటీలో మెకానికల్‌ ఇంజినీర్‌గా పట్టభద్రులయ్యారు. 1979–81లో కాన్పూరు ఐఐటీలో ఎంటెక్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్‌కు ఎంపికై 1984 ఐపీఎస్‌ బ్యాచ్‌లో ఆంధ్రా కేడర్‌లో విధుల్లో చేరారు. కుటుంబ పెద్దల నిర్ణయం మేరకు ఉమను వివాహం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. 2010లో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయనకు డీజీపీ హోదా దక్కింది. డీజీపీ హోదాలోనే రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసి అనేక సంస్కరణలు చేపట్టారు. 2015 జనవరి నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఆ సంస్థ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 23 నుంచి రాష్ట్ర పోలీస్‌ శాఖ పగ్గాలు అందుకోనున్నారు. 
     
     

Advertisement
Advertisement