మండలంలోని ఎల్‌కే ఫారం గ్రామానికి చెందిన పైస లింగంకు చెందిన ఏటీఎం కార్డును గుర్తు తెలియని దుండగులు అపహరించి రూ. 10 వేలు డ్రా చేసుకున్నారని
ఏటీఎం కార్డుతో డబ్బుల అపహరణ
Oct 6 2016 10:21 PM | Updated on Sep 4 2017 4:25 PM
నవీపేట :
మండలంలోని ఎల్‌కే ఫారం గ్రామానికి చెందిన పైస లింగంకు చెందిన ఏటీఎం కార్డును గుర్తు తెలియని దుండగులు అపహరించి రూ. 10 వేలు డ్రా చేసుకున్నారని ఎస్సై రవీందర్‌నాయక్ గురువారం తెలిపారు. కొద్ది రోజుల కిందట పైస లింగం తన ఖాతాలోని డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని గుర్తు తెలియని యువకుడికి తన ఏటీఎం కార్డును ఇచ్చాడని పేర్కొన్నారు. సదరు వ్యక్తి కార్డు పని చేయడం లేదని ఇంకో కార్డును మార్చి ఇచ్చాడని పేర్కొన్నారు. డబ్బులను డ్రా చేసుకునేందుకు మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్ బ్యాంక్‌కు వెళ్లగా ఖాతాలోని రూ. 10వేలు డ్రా చేసినట్లు బ్యాంక్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement