తల్లి మందలించిందని.. డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య | Degree Student Commits Suicide In hyderabad | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందని.. డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య

Jul 21 2018 10:13 AM | Updated on Nov 6 2018 8:16 PM

Degree Student Commits Suicide In hyderabad - Sakshi

శాలిని మృతదేహం

బన్సీలాల్‌పేట్‌: తల్లి మందలించిందని మనస్తాపానికి లోనైన ఓ విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. అడ్మిన్‌ ఎస్‌.ఐ రమేష్‌ కథనం  ప్రకారం.... బన్సీలాల్‌పేట్‌ ప్రాంతానికి చెందిన శివరాజ్, దుర్గ దంపతుల కుమార్తె శాలిని(20). గురువారం రాత్రి పని విషయంలో తల్లి దుర్గ కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన శాలిని ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దేవాలయానికి వెళ్లిన వచ్చిన శివరాజ్‌ తలుపు కొట్టినా తెరవకపోవడంతో కిటికీ  లోనుంచి చూడగా శాలిని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్ధానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి ఆమెను కిందికి దించగా అప్పటికే మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement