సెరా శానిటరీవేర్‌ నెల్లూరు ప్లాంటు విస్తరణ | Sakshi
Sakshi News home page

సెరా శానిటరీవేర్‌ నెల్లూరు ప్లాంటు విస్తరణ

Published Mon, Jul 23 2018 1:13 AM

Cera sanitaryware Nellore plant expansion - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: శానిటరీవేర్‌ తయారీ కంపెనీ సెరా నెల్లూరు ప్లాంటును విస్తరించనుంది. గూడూరు వద్ద ఉన్న ఈ టైల్స్‌ తయారీ కేంద్రం రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 10,000 చదరపు మీటర్లు. దీనిని రూ.50 కోట్ల వ్యయంతో రెండింతల సామర్థ్యానికి చేర్చనున్నట్టు సెరా సానిటరీవేర్‌ సీఎండీ విక్రమ్‌ సొమానీ ఆదివారం తెలిపారు. జూబ్లీహిల్స్‌లో సెరా స్టైల్‌ స్టూడియోను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,180 కోట్ల టర్నోవర్‌ సాధించాం. 2018–19లో రూ.1,500 కోట్లు ఆశిస్తున్నాం. టైల్స్‌ తయారీకి జాయింట్‌ వెంచర్స్‌ కోసం చూస్తున్నాం. గుజరాత్‌లో రూ.25 కోట్లతో నెలకొల్పుతున్న పాలిమర్‌ ప్లాంటు లో ఫిబ్రవరి నుంచి ఉత్పత్తి  మొదలు కానుంది’ అని చెప్పారు. సెరా స్టైల్‌ స్టూడియోలో కంపెనీ ఉత్పత్తులను కేవలం ప్రదర్శిస్తామని సేల్స్‌ డీజీఎం జి.వి.చౌదరి తెలిపారు. 2017–18లో ఏపీ, తెలంగాణలో రూ.158 కోట్లు ఆర్జించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు లక్ష్యమని వివరించారు.

Advertisement
Advertisement