అఖిలప్రియకు చేదుఅనుభవం | sour experience to Allagadda MLA bhuma akhila priya | Sakshi
Sakshi News home page

అఖిలప్రియకు చేదుఅనుభవం

Jan 19 2017 5:59 PM | Updated on Apr 4 2019 3:02 PM

అఖిలప్రియకు చేదుఅనుభవం - Sakshi

అఖిలప్రియకు చేదుఅనుభవం

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు గురువారం చేదు అనుభవం ఎదురైంది.

విజయవాడ: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. అఖిలప్రియ సచివాలయానికి వెళుతుండగా అదే మార్గంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ వచ్చింది. జగన్ వస్తున్నారని తెలిసి రైతులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. రోడ్డు పొడవునా వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో చేసేదేమి లేక అఖిలప్రియ అక్కడి నుంచి వెనుదిరిగారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని గ్రామాల్లోని రైతులను కలుసుకునేందుకు వైఎస్ జగన్ నేడు పర్యటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement