'మంచి రాజధానికి 35వేల ఎకరాలు కావాల్సిందే' | somireddy statement on capital lands | Sakshi
Sakshi News home page

'మంచి రాజధానికి 35వేల ఎకరాలు కావాల్సిందే'

Aug 29 2015 7:31 PM | Updated on Oct 22 2018 8:50 PM

మంచి రాజధాని నిర్మించాలంటే మొత్తం 35 వేల ఎకరాల భూమి కావాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

తిరుమల: మంచి రాజధాని నిర్మించాలంటే మొత్తం 35 వేల ఎకరాల భూమి కావాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 33 వేల ఎకరాల భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, మిగిలిన భూమిని కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంచి రాజధాని నిర్మించే శక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇవ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకహోదాతో పాటు ప్యాకేజీ, రైల్వే జోన్ ఇవ్వాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement