వైఎస్సార్‌సీపీలో నియామకాలు | Some of appointments is done in Ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

Dec 4 2014 2:03 AM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి సంబంధించి బుధవారం కొన్ని నియామకాలు చేశారని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి సంబంధించి బుధవారం కొన్ని నియామకాలు చేశారని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళ్యాణదుర్గం (అనంతపురం జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్‌గా వ్యవహరించిన బోయ తిప్పేస్వామి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా కేవీ ఉషశ్రీ చరణ్‌ను నియమించారు. ఆమె కళ్యాణదుర్గం సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తారు. వైఎస్సార్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా పి.రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా చెల్లా రాజశేఖర్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఖాజాను నియమించినట్లు పేర్కొన్నారు.
 

Advertisement

పోల్

Advertisement