గిరిజన మహిళపై అత్యాచారం | rape on Tribal woman | Sakshi
Sakshi News home page

గిరిజన మహిళపై అత్యాచారం

May 15 2015 2:19 AM | Updated on Jul 28 2018 8:51 PM

గిరిజన మహిళపై ఓ వ్యక్తి దారుణంగా దాడిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు

దారుణానికి ఒడిగట్టిన యువకుడు

 పాడేరు: గిరిజన మహిళపై ఓ వ్యక్తి దారుణంగా దాడిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు .. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం కుమడ గ్రామానికి చెందిన ఓ మహిళ కొన్నేళ్లుగా పాడేరులో  ఉంటోంది. ఇటీవల భర్తతో తగాదాపడి ఒంటరిగా ఉంటోంది. పాడేరుకు చెందిన క్షత్రి నరేష్ అనే వ్యక్తి ఆమెకు తరచూ ఫోన్ చేస్తూ వేధించేవాడు. ఈనెల 12న ఇంటిలోకి చొరబడి ఆమెపై భౌతికంగా దాడి చేశాడు. బెల్ట్, ఇనుపరాడ్‌తో కొట్టాడు. తీవ్ర గాయాలతో స్ఫృహ తప్పిపడిపోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

మరునాడు ఉదయం మెలకువ వచ్చిన ఆమె బంధువులకు విషయం తెలిపింది. పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు నరేష్‌ను కోరగా కులదూషణకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమెను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడ్ని అదుపులో తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. నిందితునిపై నిర్భయ, ఎస్‌సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement