వ్యవసాయ బావిలో పడ్డ డీసీఎం వ్యాన్ : క్లీనర్ మృతి | One person died in DCM van accident at gurralagondi village at medak district | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బావిలో పడ్డ డీసీఎం వ్యాన్ : క్లీనర్ మృతి

Aug 14 2013 8:51 AM | Updated on Sep 1 2017 9:50 PM

చినకోడూరు మండలం గుర్రాలగొండి గ్రామ శివారులో డీసీఎం వ్యాన్ అదుపుతప్పి గత అర్థరాత్రి వ్యవసాయబావిలో పడింది.

మెదక్ జిల్లా చినకోడూరు మండలం గుర్రాలగొండి గ్రామ శివారులో డీసీఎం వ్యాన్ అదుపు తప్పి గత అర్థరాత్రి వ్యవసాయ బావిలో పడింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్ను వ్యవసాయ బావి నుంచి బయటకు తీసి హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఏకంగా వ్యానే బోరు బావిలో పడిపోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం నుంచి బయటపడ్డ డ్రైవర్

అలాగే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని క్లీనర్ మృతదేహన్ని స్థానికుల సాయంతో వెలుపలకు తీశారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement