విశాఖ జిల్లా సరిహద్దులలో గిరిజన వివాహిత యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
విశాఖపట్నం: విశాఖ జిల్లా సరిహద్దులలో గిరిజన వివాహిత యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డొంకరాయి గ్రామంలో ఈ దారుణం జరిగింది. గిరిజన యువతిని కొందరు మభ్యపెట్టి మద్యం మత్తులో అత్యాచారం చేశారు.
గత నెల 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.