‘డబుల్’.. ట్రబుల్ | Double-decker train cancellations | Sakshi
Sakshi News home page

‘డబుల్’.. ట్రబుల్

Aug 22 2015 1:34 AM | Updated on Sep 3 2017 7:52 AM

కాచిగూడ-గుంటూరు మధ్య గతేడాది ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ రైలు రద్దుకానుంది. ఆశించనంత ఆ క్యుపెన్సీ లేకపోవడంతో దీన్ని రద్దు చేయాలని దక్షిణమధ్య

తెనాలి : కాచిగూడ-గుంటూరు మధ్య గతేడాది ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ రైలు రద్దుకానుంది. ఆశించనంత ఆ క్యుపెన్సీ లేకపోవడంతో దీన్ని రద్దు చేయాలని దక్షిణమధ్య రైల్వే ప్రతిపాదించింది. దీనిపై రైల్వేబోర్డు త్వరలో  నిర్ణయం తీసుకునే అవకాశముంది.  
 
 ఏడాదిలోనే...
 గుంటూరు జిల్లాకు రైల్వేబోర్డు గత ఏడాది మేలో డబుల్ డెక్కర్ రైలు సౌకర్యాన్ని కల్పిం చింది. పూర్తి ఏసీ సౌకర్యంతో కొత్త బోగీలతో రైలు ముస్తాబై వచ్చింది. వారంలో మంగళ, శుక్రవారాల్లో నడుపుతున్నారు. కాచిగూడలో ఉదయం 5.30గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 10.45 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 12:45 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి సా యంత్రం 5 గంటలకు కాచిగూడ చేరుతుంది. అయితే ఆరంభం నుంచే ఈ రైలుకు ఆక్యుపెన్సీ సమస్య వెంటాడుతోంది. మొత్తం 1,200 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ రైలు లో 10శాతం సీట్లు కూడా నిండటం లేదు. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైలు నడపడం వృథా ప్రయాస అంటూ రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ మార్గంలో తగిన ఆక్యుపెన్సీ లేనందున చెన్నై- విశాఖపట్టణం మధ్య నడపాలని లేదా సరెండర్ చేసుకోవాలని అందులో పేర్కొన్నట్టు తెలిసింది.
 
 మార్పుతో మంచి ఫలితాలు ..
 అయితే ఈ రైలు ప్రయాణ వేళలపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాచిపూడి నుంచి రైలు బయలుదేరే ఉదయం 5.30 గంటల సమ యం అనువైంది కాదని అందరికీ తె లిసిందే. దీంతో ఉదయం 7.15 గంట లకు సికింద్రాబాద్ నుంచి వచ్చే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకుంటున్నా రు. దీనికి తోడు కాచిగూడ నుంచి బ యలుదేరాక సికింద్రాబాద్‌కు రాకుం డా మల్కాజిగిరి మీదుగా బీబీనగర్, నల్గొండ మార్గంలో గుంటూరుకు వ స్తుంది. అలాగే గుంటూరు నుంచి బ యలుదేరే మధ్యాహ్నం 12.45 గంట ల సమయంలో ‘జన్మభూమి’అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు ఆ రైలుకే మొగ్గుచూపుతున్నారు.
 
 ఇలా చేస్తే...
 తెనాలి రైల్వే జంక్షన్ నుంచి గతంలో నడిచిన నాగార్జున ఎక్స్‌ప్రెస్‌ను రద్దుచేసి, విశాఖపట్నం నుంచి విజయవాడకు వస్తున్న జన్మభూమి రైలును తెనాలికి పొడిగించారు. అప్పట్నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు మొదలయ్యాయి. జన్మభూమిలో విజయవాడకు చేరుకోకముందే సీట్లు నిండిపోతున్నాయి. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను తెనాలికి పొడిగించాలన్న డిమాండ్ కూడా ప్రజాప్రతినిధుల వాగ్ధానం నెరవేరలేదు. ప్రస్తుతం గుంటూరు వరకు వస్తున్న డబుల్ డెక్కర్‌ను, గతంలో రద్దయిన ‘నాగార్జున’ స్థానం లో తెనాలికి పొడిగించడం, నాన్ ఏసీ బోగీలను చేర్చి, రెగ్యులర్ చేయాలి. కాచిగూడ కాకుండా సికింద్రాబాద్ నుంచి నడపటం, ప్రయాణ సమయాలను కొంత సవరిస్తే ఆక్యుపెన్సీ పెరుగుతుందని తెనాలి రైల్వే ప్రయాణికు ల సంఘం అధ్యక్షుడు కోపల్లె రామనరసింహారావు చెప్పారు. ఈ విషయం లో జిల్లా ఎంపీలు జోక్యం చేసుకోవా ల్సి ఉంది. రద్దు తప్పని పరిస్థితుల్లో కనీసం చెన్నై-విశాఖపట్టణం మధ్య వయా న్యూ గుంటూరు మీదుగా నడిపినా ప్రయోజనం ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement