Top Stories
ప్రధాన వార్తలు

యూఎన్వో కీలక భేటీలో పాకిస్థాన్‌కు భంగపాటు
యూఎన్వో సమావేశంలో పాకిస్థాన్‌కు భంగపాటు ఎదురైంది. పహల్గాం ఉగ్రదాడిని యూఎన్వో తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ చెప్పిన పలు అంశాలను సభ్య దేశాలు తిరస్కరించాయి. లష్కరే తోయిబా ప్రమేయంపై పాక్‌ను యూఎన్వో ఆరాతీసింది. ప్రత్యేకంగా ఒక మతం వారినే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ క్షిపణి పరీక్షలపై యూఎన్వో ఆందోళన వ్యక్తం చేసిందిపహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండా భారత్ చర్యలపైనే ఫోకస్ పెట్టిన పాక్.. సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని భద్రతా మండలిలో ప్రస్తావించింది. భారత్, పాకిస్థాన్ సంయమనం పాటించాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. భద్రతామండలిలో భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన పాకిస్తాన్.. భారత్ చర్యలను తప్పు బట్టే ప్రయత్నం చేసింది. ఎలాంటి తీర్మానం లేకుండానే భద్రతా మండలి రహస్య సమావేశం ముగిసింది.భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వెలిబుచ్చింది. వాటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరు దేశాలకూ సూచించారు. అందుకు దన్నుగా నిలిచేందుకు ఐరాస సిద్ధమని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని హితవు పలికారు.సాయుధ ఘర్షణ మొదలైతే పరిస్థితి అదుపు తప్పుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్‌లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. ఆ పాశవిక దాడిని మరోసారి ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలా పౌరులను లక్ష్యం చేసుకోవడం దారుణం. దీనికి పాల్పడ్డవారికి చట్టపరంగా కఠిన శిక్షపడాల్సిందే’’ అన్నారు.

యుద్ధానికి సిద్ధం!.. నేడు కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
ఢిల్లీ: యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ నేడు కీలక సమీక్ష నిర్వహించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో యుద్ధ సన్నద్ధతపై కీలక సమీక్ష చేపట్టనుంది. రేపు(బుధవారం) అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని సోమవారం కేంద్రం ఆదేశించించిన సంగతి తెలిసిందే. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్‌కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సమీక్షించనుంది.కాగా, సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ నిన్న (సోమవారం) కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.కాగా, దేశ రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (సోమవారం) కీలక సమీక్షలు నిర్వహించారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతి చర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక ఎజెండా అని తెలుస్తోంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. సైనిక సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని ఒక్కొక్కరుగా సమావేశం కావడం తెలిసిందే. పహల్గాంకు బదులు తీర్చుకునే పూర్తి బాధ్యతలను మోదీ వారికే అప్పగించారు.

సింహాచలం ఘటన: బాబూ.. ఇదేం వక్రబుద్ధి.. భక్తుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ప్రమాద బాధితులకు పరిహారంలోనూ సీఎం చంద్రబాబు తన వక్ర బుద్ధిని చాటుకున్నారు. బాధితులకు పరిహారం సింహాచలం దేవస్థానం నుంచి చెల్లించారను. చనిపోయిన ఒక్కొక్కరికి 25 లక్షలు, గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం అందించగా, మొత్తంగా కోటి 78 లక్షల రూపాయలు దేవస్థానం నుంచి చెల్లింపు చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేవాలయ అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను బాధితులకు ఇవ్వడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహార విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాల్సిన పరిహారాన్ని సింహాచలం దేవస్థానం నుంచి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సింహాచలం ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. చివరికి సింహాచలం ప్రమాదంపై ఉద్యోగులే బలయ్యారు. కూటమి ప్రజా ప్రతినిధులందరూ సేఫ్‌గా బయటపడ్డారు.ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. ఈవో సహా మరో ఆరుగురు ఇంజనీరింగ్ సిబ్బందిపై వేటు వేయడానికి నిర్ణియించింది. ఇంజనీరింగ్ సిబ్బందిలో కాంట్రాక్ట్ ఉద్యోగిపైన చర్యలకు సిద్ధమైంది. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు కోవడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. కూటమి నాయకులను తప్పించి అధికారులను బలి పశువుల చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే కమిటీ నివేదిక ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లెక్క తేల్చిన వరుణుడు!.. సన్‌రైజర్స్ అవుట్.. మరి ఢిల్లీ రేసులో ఉందా?
ఆరెంజ్ ఆర్మీ అశలను ఆవిరి చేసే వార్త!.. హైదరాబాద్ ‘ప్లే ఆఫ్స్’ ఆశలకు హైదరాబాద్‌లోనే తెరపడింది. దీంతో ఈ ఐపీఎల్లో సన్‌రైజర్స్ ముందుకా... వెనక్కా అని ఈ నెల 18న లక్నోలో సూపర్‌జెయింట్స్‌తో జరిగే మ్యాచ్ వరకు నిరీక్షించాల్సిన పని లేకుండానే వరుణుడు తేల్చేశాడు. కమిన్స్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో మొదలైన మ్యాచ్‌పై విరామంలో నీళ్లతో నింపేశాడు. చినుకులా కురిసిన వాన... వరదలా మారింది. మైదానం మొత్తాన్ని చిత్తడి చిత్తడి చేసింది. దీంతో తెరిపినిచ్చినా... తేరుకొని ఆడే అవకాశమే లేకపోయింది. ఇక చేయాల్సిందల్లా మిగిలిపోయిన ఆ మూడు మ్యాచ్‌లు ఆడటం తప్ప గత ఏడాది రన్నరప్ ‘రైజర్స్’కు ఇంకేం మిగల్లేదు! సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ఈసారి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలుండగానే ముగిసింది. సొంతగడ్డపై సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ముందుకెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఇక మిగతా మ్యాచ్‌లను గెలిచి పాయింట్ల పట్టికలో కాస్త మెరుగైన స్థానంలో నిలవడమే మిగిలుంది. సన్‌రైజర్స్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా 13 పాయింట్ల వద్దే నిలిచిపోతుంది. టాప్–4లో నిలిచే జట్లే ‘ప్లే ఆఫ్స్’ దశకు చేరుతాయి. ఇప్పటికే నాలుగు జట్లు కనీసం 14 పాయింట్ల సంఖ్యను అందుకున్నాయి. ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (36 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు), ధాటిగా ఆడారు. ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ విరామానికి ఇరుజట్ల ఆటగాళ్లు వెళ్లగానే మైదానంలోకి అనుకోని అతిథిగా వచ్చిపడిన వాన స్టేడియాన్ని ముంచెత్తింది. భారీ వర్షం చాలా సేపటికి తగ్గినా... అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇలా..వర్షం కారణంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవమయ్యాయి. ఇప్పటికి మొత్తంగా పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచిన ఢిల్లీ ఖాతాలో పన్నెండు పాయింట్లు ఉండగా.. మ్యాచ్ రద్దైనందు వల్ల నిబంధనల ప్రకారం తాజాగా మరో పాయింట్ అదనంగా చేరింది. దీంతో ప్రస్తుతం పదమూడు పాయింట్లతో ఢిల్లీ పట్టికలో ఐదో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేటు (0.362) పరంగానూ మెరుగ్గానే ఉంది.ఇక లీగ్ దశలో ఢిల్లీకి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌తో మే 8న ధర్మశాలలో, మే 11న గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీలో.. అదే విధంగా వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో మే 15న అక్షర్ సేన తలపడాల్సి ఉంది.ఈ మూడు మ్యాచ్‌లలో గెలిస్తే పందొమ్మిది పాయింట్లతో సులువుగానే ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరుతుంది. రెండు గెలిస్తే 17 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఇలాంటి దశలో నెట్ రన్‌రేటు భారీగా మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లలో గనుక ఓడితే పదిహేను పాయింట్లే వస్తాయి కాబట్టి.. ఇప్పటికే పద్నాలుగేసి పాయింట్లతో ఉన్న ముంబై, గుజరాత్ ఒక్కో మ్యాచ్ గెలిస్తే టాప్-4కు ఈజీగానే చేరుకుంటాయి. ఇదంతా కాక.. ఢిల్లీ గనుక మూడూ ఓడిపోతే కథ కంచికే!చదవండి: IPL 2025 MI Vs GT: సమఉజ్జీల సమరంప్రస్తుత పాయింట్ల పట్టికలో టాప్-5 ఇలా.. PC: IPL SMACKED...and again! 🔥Ashutosh Sharma adding the much-needed fire to #DC's innings 💪Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @DelhiCapitals pic.twitter.com/sMA3ZLKotz— IndianPremierLeague (@IPL) May 5, 2025

Success Story: జస్ట్ 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..!
చిన్న వయసు నుంచే సామాజిక సేవ చేయాలనే తపన, న్యాయవాది కావాలన్న తన తండ్రి ఆశయాన్ని గమనించారు.. లా పూర్తి చేసినా న్యాయవాదిగా స్థిరపడాలన్న తండ్రి లక్ష్యం నెరవేరలేదు.. అందుకే తండ్రి కలను పట్టుదలతో తాను సాధించారు.. న్యాయవాది కాదు.. ఏకంగా న్యాయమూర్తిగానే ఎంపికయ్యారు.. మొదటి ప్రయత్నంలోనే.. ఉన్నత స్థానాన్ని అధిరోహించారు.. స్ఫూర్తిమంతమైన ఆమె ప్రయాణం ఆమె మాటల్లోనే.. తెలంగాణ రాష్ట్రం మల్కాజిగిరికి చెందిన శ్రీవల్లి శైలజ 2024లో నిర్వహించిన జ్యుడీషియరీ పరీక్షలో జనరల్ కేటగిరిలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 24 ఏళ్ల వయసులో చదువు పూర్తయిన అనతి కాలంలోనే న్యాయమూర్తిగా ఎంపిక కావడం పట్ల ఇంటా బయటా ప్రశంసల జల్లు కురుస్తోంది. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన తాను చిన్ననాటి నుంచే సామాజిక సేవ చేయాలన్న తండ్రి ఆశయంతో పెరిగారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడు అయినా న్యాయమూర్తి కాలేకపోయారు. దీంతో తండ్రి ఆశయాన్నే తన ఆశయంగా చేసుకుని లక్ష్యం చేరుకున్నారు శ్రీవల్లి. ఇంటర్ అవగానే ఎంసెట్, లా ప్రవేశపరీక్షలు రెండూ రాశారు. రెంటిలోనూ మంచి ర్యాంకులు సాధించారు. తండ్రి ప్రోత్సాహంతో జ్యుడీషియరీ మెయిన్స్ వైపు అడుగులువేశారు. ప్రభుత్వాధికారుల కుటుంబం నుంచి.. అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వాధికారులు. నాన్న రమేష్ నరసింహం హైదరాబాద్‌లో సీజీఎస్టీ సూపరింటెండెంట్. తల్లి లక్ష్మీసురేఖ దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో అసిస్టెంట్ ఆఫీసర్. ఓయూలో ఎల్ఎల్బీ, నల్సార్ యూనివర్శిటీలో ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. అనంతరం జ్యుడీషియరీ మెయిన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జూనియర్ సివిల్ జడ్జి వరకూ ఎదిగారు. శ్రీవల్లి సోదరి సహితం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో ఐపీఎం (మూడో సంవత్సరం) చదువుతున్నారు. నాన్న కల నెరవేరింది.. జ్యుడీషియరీ మెయిన్స్ తరువాత ఏప్రిల్ నెల్లో ఇంటర్వ్యూ జరిగింది. ఫలితాలు కొద్ది రోజుల క్రితమే వచ్చాయి. చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జి వంటి ఉన్నత ఉద్యోగం లభించడం సంతోషించదగ్గ విషయం. నాన్న కల నెరవేరింది. నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. సామాజిక న్యాయం కోసం కృషి చేయగలనన్న నమ్మకం కలిగింది. జ్యుడీషియరీలో అత్యున్నత స్థానం వరకూ వెళ్లేందుకు సాధన చేస్తా. – శ్రీవల్లి శైలజ, జూనియర్ సివిల్ జడ్జి (చదవండి: 'షాడో తోలు బొమ్మలాట'ను సజీవంగా నిలిపింది..! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..)

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
కటిహార్: బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రాక్టర్ ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.బాధితులంతా సుపౌల్‌కు చెందినవారని, వివాహ వేడుకకు హాజరై తిరిగి సొంతూరుకు వస్తుండగా ప్రమాదం జరిగిందని కటిహార్ ఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని వెల్లడించారు.

కుంభకోణం కనికట్టు.. బాబే మద్యం సామ్రాట్టు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలుపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన ట్రేడ్‌మార్కు డైవర్షన్ కుట్రకు మరింత పదును పెడుతుండగా... అందుకు ఎల్లో మీడియా కోరస్ పాడుతూ కుట్ర కథను రక్తి కట్టించేందుకు యతి్నస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతున్న పరిణామాలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో అభూత కల్పనలు చేరుస్తూ.. కస్టడీలో చెప్పని అంశాలను చెప్పినట్లుగా చిత్రీకరిస్తూ ఎల్లోమీడియా ద్వారా దు్రష్పచారానికి తెగబడుతున్నారు. అసలు జరగని స్కామ్‌లో కుట్రపూరితంగా ఇరికించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అధికారంలోకి వచి్చనప్పటి నుంచి దీన్ని వైఎస్సార్ సీపీకి ఆపాదించేందుకు శతవిధాలా ప్రయతి్నస్తున్న టీడీపీ కూటమి సర్కారు కక్షగట్టి బెదిరిస్తూ అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ అక్రమ కేసు దర్యాప్తును మొదట సీఐడీకి అప్పగించిన చంద్రబాబు సర్కారు.. మూడు నెలలు విచారణ అనంతరం సీఐడీ చేతులెత్తేయడంతో సిట్ ఏర్పాటుతో కొత్త పన్నాగానికి తెరతీసింది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. సిట్ వేధింపులపై డిస్టిలరీల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారిని ఇంటి వద్దే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. రిమాండ్ రిపోర్టుల పేరుతో అభూత కల్పనలు సృష్టించడం, కస్టడీలో చెప్పని విషయాలను చెప్పినట్లుగా ఎల్లో మీడియాకు లీకులివ్వడం సిట్ బరితెగింపునకు పరాకాష్ట. ఏది నిజం ?ఓవైపు కొత్త డిస్టిలరీలకు పచ్చజెండా ఊపి.. తమవారికే దుకాణాలు కట్టబెట్టి.. బెల్టు షాపులకు గేట్లెత్తి.. ఇలా మద్యంలో అన్నివిధాల అడ్డగోలు దోపిడీ దందాకు దన్నుగా నిలుస్తూ.. మరోవైపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వీరంగం వేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. దీనికోసం వీర విధేయ అధికారులతో సిట్ వేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది. రిమాండ్ రిపోర్టుల పేరుతో కట్టు కథలు అల్లుతోంది.మద్యం దందాకు మార్గాలుగా ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. బెల్ట్ దుకాణాలు తొలగించింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. కొత్తగా ఒక్క డిస్టిలరీకి, మద్యం బ్రాండ్లకు అనుమతినివ్వని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే. మద్యం అమ్మకాలను తగ్గించి దశలవారీ మద్యం నియంత్రణ విధానాన్నిసమర్థంగా అమలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మరి మద్యం అమ్మకాలు తగ్గిస్తే కమీషన్లు ఎందుకు ఇస్తారు... ఇవ్వరు కదా అన్నది ఎవర్ని అడిగినా ఠక్కున చెప్పే సమాధానమే. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రేనన్నది సుస్పష్టం. అందుకే పాలుకు పాలు నీళ్లకు నీళ్లుగా ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రభుత్వ మద్యం విధానాలపై సహేతుక విశ్లేషణ ఇదీ...కుంభకోణం కాదు ఇదీ అసలు కోణం ఎవరి పాలనలో ఏం జరిగిందో నిగ్గు తేల్చేదే ఈ కథనంసిండికేటు కడితే స్కామా? ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా?2014–19 మధ్యన, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల సిండికేట్ నెలకొంది. తమ పార్టీ నేతలకే దుకాణాల లైసెన్సులు కేటాయించారు. మద్యంలో లంచాలు తీసుకోవాలి అని అనుకుంటేనే ప్రైవేటు దుకాణాలు కేటాయిస్తారు. ఇక అప్పుడూ ఇప్పుడూ భారీగా అమ్మకాల టార్గెట్ ఉండనే ఉంది. 2014–19 మధ్యన చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజును తగ్గించారు. ఈ సమయంలో ప్రభుత్వ హయాంలో 4,380 ప్రైవేటు దుకాణాలు, వీటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్ రూమ్‌లు ఉండేవి. నాడు 43 వేల బెల్ట్ దుకాణాలు కూడా నడిచాయి. గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటు మద్యం సిండికేట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. టీడీపీ కూటమి నేతలకే 3,394 దుకాణాలను కేటాయించింది. 55 వేల నుంచి 60 వేల బెల్ట్ దుకాణాల ద్వారా మద్యం ఏరులై పారిస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 2,934 దుకాణాల ద్వారా అమ్మకాలు సాగించింది. నిర్దిష్ట వేళలతో అమ్మకాలను కూడా కట్టడి చేసింది. పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. బెల్టు షాపులు అనే మాటే లేకుండా చేసి దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట వేసింది.రూ.120ది నాసిరకమా? రూ.99 నాసిరకమావైఎస్సార్‌సీపీ ప్రభుత్వలో క్వార్టర్ బాటిల్‌కు రూ.120 కనీస ధరగా ఉంటేనే నాసిరకం మద్యం అని టీడీపీ దుష్ప్రచారం చేసింది. అందుకోసం చెన్నైకు చెందిన ఓ ల్యాబ్ పేరుతో తప్పుడు నివేదికను ప్రచారంలోకి తెచ్చింది. కానీ, అలాంటి నివేదికను తాము ఇవ్వలేదని ఆ ల్యాబ్ ఖండించింది. ఇక ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో రూ.99కే క్వార్టర్ బాటిల్ విక్రయిస్తున్నారు.క్వార్టర్ రూ.99కే వచ్చేది నాసిరకం మద్యమా? రూ.120కి అమ్మేది నాసిరకం మద్యమా??వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నడిపితే స్కాం అంటున్నారు..? మరి నాడు, నేడు రాష్ట్రమంతా టీడీపీ నాయకులు సిండికేటు కట్టి దుకాణాలు నడిపిస్తున్నారు. టీడీపీ నేతలకు దుకాణాలు, బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌ల తలుపులు బార్లా తెరిచిన చంద్రబాబు పాలనలో స్కాంలకు అవకాశం ఉందా? ఇవేవీ లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కుంభకోణానికి ఆస్కారం ఉందా?అమ్మకాలు తగ్గిస్తే కమీషన్లు వస్తాయా? పెరిగితే వస్తాయా??మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే అంతగా కమీషన్లు వస్తాయి. అదే టీడీపీ విధానంగానూ మారింది. అందుకనే 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం మద్యం విక్రయాలను విపరీతంగా ప్రోత్సహించింది. 2019 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను తగ్గించింది. దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. ధరలను షాక్ కొట్టేలా పెంచి మద్యపానాన్ని నిరుత్సాహపరిచింది.మరి ఎవరి హయాంలో స్కాంలకు అవకాశం ఉంటుంది. లావాదేవీలు పెరిగి.. డబ్బు చేతులు మారే చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా?పాపాల పుట్టలు డిస్టిలరీలు పుట్టింది ఎవరి పాలనలో...?మద్యం విధానంలో అవినీతి, దోపిడీ అంతా డిస్టిలరీల మసుగులోనే సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే గతంలో అనుమతినిచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. ఇక టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, దివంగత డీకే ఆదికేశవులు కుటుంబాలకే డిస్టిలరీలు కేటాయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు.కాగా, డిస్టిలరీలకు మద్యం తయారీ కోసం లైసెన్సులు జారీ చేసి.. బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లు ఎంప్యానెల్ జాబితాలో 14 డిస్టిలరీలను చేర్చింది చంద్రబాబు ప్రభుత్వమే.డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే అయితే అవినీతికి పాల్పడిందీ వారే అవుతారు కదా..? మరి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసే కదా??బెల్టు షాపులు లేకుండా చేస్తే స్కాం ఎలా?అసలు డిస్టిలరీలు ఎప్పుడు కమీషన్లు ఇస్తాయన్నది కీలకం. మద్యం అమ్మకాలు పెరిగినకొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. కాబట్టి విక్రయాలు పెంచితే ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు భారీగా సాగగా... అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019–24లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వ పెద్దలకే అన్నది సుస్పష్టం.ఊరూపేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టింది ఎవరు?మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట ఊరూపేరూ లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం కచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే 2014–19 మధ్యన రాష్ట్రంలో ఎన్నడూ వినిపించని దాదాపు 200 బ్రాండ్లను తెచ్చారు చంద్రబాబు. అందులో కొన్నిటి పేర్లు... ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ, హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.తమవారికి దోచించి ఎవరు?2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొన్నారు. సి–టెల్ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ నివేదికే వెల్లడించింది కూడా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూ యిష్టమైన సి–టెల్‌సాఫ్ట్‌వేర్‌ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకీ 5 శాతం నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది.సగంపైగా మద్యం కొనుగోలు జరిగిన చంద్రబాబు జమానాలో అవినీతి ఉంటుందా..? అందరికీ ఆర్డర్లు వచ్చేలా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవినీతి చోటుచేసుకుంటుందా??‘ప్రివిలేజ్’గా సిండికేట్‌తో ఖజానాకు గండి కొట్టింది ఎవరు?మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఆ ఫీజును గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండి పడుతుంది. సీఎం హోదాలో నోట్ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా నాలుగేళ్లలోనే రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా జారీ చేయనేలేదు.ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టింది ఎవరు? తమవారికి అడ్డగోలుగా దోచిపెట్టింది ఎవరు? ఎవరిపై కేసు నమోదు చేయాలి??నాడు... కుంభకోణం బహిర్గతంనేడు.. లేని కుంభకోణం ఉన్నట్టు చూపే కుతంత్రం2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో కుంభకోణానికి తెగించారు. డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బార్లు, బెల్ట్ దుకాణాలు, ప్రివిలేజ్ ఫీజు మాఫీ.. ఇలా అన్నీ అందులో భాగమే. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కూడా దీనిని స్పష్టం చేసింది. 2023లో కేసు నమోదు చేసిన సీఐడీ పూర్తి ఆధారాలతో అవినీతి నిగ్గు తేల్చి చంద్రబాబు ముఠాపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. బెల్ట్ దుకాణాలు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే .చట్టాన్ని సిట్ ఉల్లంఘిస్తోంది!?డిస్టిలరీల నుంచి కమీషన్లు వసూలు చేశారు అంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతోంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతగా వేధిస్తున్నా డిస్టిలరీల ప్రతినిధులు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని సిట్ అధికారులు కిడ్నాప్ చేసి మరీ తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని పోలీసు శైలిలో హింసించారు. దానిపై డిస్టిలరీల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్ కుట్ర బయటపడింది. రెడ్‌బుక్ కక్ష సాధింపుతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసుతో వేధిస్తోందన్నది స్పష్టమైంది.విచారణ పేరుతో సిట్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ, బలవంతంగా విజయవాడ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారని, వయో వృద్ధులమైన తాము శారీరకంగా తీవ్ర అవస్థలు పడుతున్నామని డిస్టలరీల ప్రతినిధులు హైకోర్టులో మొర పెట్టుకున్నారు. వీరి పిటిషన్లపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. సిట్ అధికారులకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. డిస్టిలరీల ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన అనంతరం వారి నివాసాలలోనే విచారించాలని ఆదేశించింది.నిజంగా స్కాం జరిగితే బెదిరింపులు ఎందుకు?బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్, అనూష తదితరులను సిట్ రోజుల తరబడి వేధించి, బాధించి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించింది. డిస్టిలరీల ప్రతినిధులను బెంబేలెత్తించి లొంగదీసుకుంది. ఇక కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరుతో సిట్ అధికారులే వాంగ్మూలం రాసేసుకున్నారు. దానిపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది. ఇతర నిందితులు, సాక్షులు చెప్పని విషయాలను కూడా చెప్పినట్టు సిట్ అబద్దపు వాంగ్మూలాలు నమోదు చేస్తోంది.అసలు జరగని మద్యం కుంభకోణంలో.. పొలిటికల్ బాస్‌ల ఆదేశాలకు అనుగుణంగా సిట్ పనిచేస్తోందా? నిజంగానే స్కాం జరిగితే ఈ వేధింపులు ఎందుకు? అంటే కేసులో బలం లేదు కాబట్టే టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచార కుట్రలకు పాల్పడుతోంది.ఏది స్కాం..? ఎందుకిస్తారు లంచాలు?⇒ మద్యం అమ్మకాలు కోట్ల కేసుల కొద్దీ పెరిగింది టీడీపీ హయాంలోనే..! –మరి మద్యాన్ని ఎక్కువగా అమ్మించినందుకు వారికే కదా లంచాలు రావాల్సింది? వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు పడిపోయాయి (పట్టిక చూడండి). మరి విక్రయాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?⇒ టీడీపీ గత ప్రభుత్వంలో, ప్రస్తుతం కూడా మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. ..అవి కూడా టీడీపీవారికి సంబంధించినవే. బెల్టు షాపులూ ఊరూరా వెలిశాయి.⇒ మరి..ప్రైవేటుగా మద్యం విక్రయిస్తే స్కాంకు అవకాశం ఉంటుందా..? లేక నేరుగా ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే స్కాం జరుగుతుందా?⇒ తెల్లవారుతూనే తూగేలా చేస్తూ.. అర్ధరాత్రి దాకా ఎక్కువ సమయం అమ్మకాలు సాగించేలా చూస్తే లంచాలు ఇస్తారా?⇒ విక్రయ వేళలను కుదించేసి, అమ్మకాలను పరిమితం చేస్తే లంచాలు ఇస్తారా?⇒ ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలను పెంచితే లంచాలకు అవకాశం ఉంటుందా? వాటికి తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా..? మరి దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా?.. బెల్టు షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ ఎంపిక చేసుకున్న 4–5 డిస్టిలరీలకు మాత్రమే ఆర్డర్లలో 53 శాతం వరకు ఇస్తే లంచాలు ఇస్తారా? మద్యంపై తక్కువ ట్సాక్స్‌తో ఎక్కువ అమ్మకాలు చేసేలా మేలు చేస్తే లంచాలు వస్తాయా?⇒ మరి..అన్ని డిస్టిలరీలకు సమానంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014–19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? ట్యాక్స్‌లు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా?⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక శాతం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? ⇒ లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు ఇస్తారా..?మద్యం వ్యవహారంలో ఎక్కడైనా అక్రమం ఎలా జరుగుతుంది?..ఎడాపెడా డిస్టిలరీలకు అనుమతులిచ్చే విధానపరమైన లోపాలతోనే! ..అమ్మకాల్లో ఎప్పుడైనా అవకతవకలకు ఎలా ఆస్కారం ఏర్పడుతుంది?..తమవారికే షాపులు దక్కేలా ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటేనే!అందులోనూ నిలువు దోపిడీ ఎలా చోటుచేసుకుంటుంది?...ఊరూరా బెల్టు షాపులతో ప్రజలను మత్తులో ఊగేలా చేస్తేనే!ఎవరైనా అధర్మంగా జేబులు నింపుకొనేందుకు ఎలా వీలు కలుగుతుంది?...సాక్షాత్తు ముఖ్య స్థానాల్లో ఉన్నవారే అవినీతికి తెగిస్తేనే!మరి ఇవన్నీ జరిగింది ఎవరి హయాంలో..? చంద్రబాబు ప్రభుత్వంలోనా.. వైఎస్సార్సీపీ హయాంలోనా?

చిరంజీవితో సినిమా.. భారీగా డిమాండ్ చేస్తోన్న స్టార్ హీరోయిన్!
సినీ పరిశ్రమలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న హీరోయిన్లే ఎక్కువ. కానీ ఈ రోజుల్లో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చి ఎండింగే లేదంటున్న హీరోయిన్లు ఉండడం విశేషమే. అలాంటి అతి తక్కువ మంది కథానాయికల్లో నయనతార ఒకరు. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్‌కు ఒకటి రెండు ఫ్లాప్‌లు ఎదురైతే కేరీర్ తలకిందులవుతుంది. అలాంటిది నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయింది.ఆ మధ్య ఈమె నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం అన్నపూరిణి నిరాశ పరిచింది. ఇటీవల కథానాయకిగా నటించిన టెస్ట్ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించలేక పోయింది. మరో పక్క పెళ్లి, భర్త, ఇద్దరు కవల పిల్లలు అంటూ సంసార జీవితం. అయినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అయితే ఈమె తొలి సారిగా బాలీవుడ్లో షారుఖ్‌ఖాన్‌తో జంటగా నటించిన జవాన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ఆ చిత్రానికి రూ.12 కోట్లు వరకూ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.అయితే తమిళ చిత్రాలకు అంత మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారా అంటే సందేహమే. అలాంటిది తాజాగా ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ.18 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. తెలుగులో చిరంజీవికి జంటగా ఒక భారీ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని.. అందులో నటించడానికి నయనతార రూ.18 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆ చిత్ర నిర్మాతల వర్గం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇదే కనుక నిజం అయితే దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతార పేరు నిలిచిపోతుంది. ఇకపోతే ఈమె ఇంతకు ముందు చిరంజీవితో సైరా, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

రే(హీ)టెక్కిన 'కరెంట్ కుంభకోణం'
సాక్షి, అమరావతి: అసలే చీకటి ఒప్పందం.. ఆపై అడ్డగోలు సమర్థన! విద్యుత్తు చట్టం 2003 సెక్షన్ 108 పేరుతో ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని బెదిరించి చీకటి ఒప్పందానికి సర్కారు ఆమోద ముద్ర!! యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై అడ్డంగా దొరికిపోవడంతో కూటమి సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ నుంచి కారుచౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకుంటే రూ.లక్ష కోట్ల భారమంటూ కూటమి నేతలు, దాని అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. ఇప్పుడు ఏకంగా యూనిట్ రూ.4.60 చొప్పున కొనేందుకు సిద్ధమై అది చాలా గొప్ప పని అంటూ నిస్సిగ్గుగా సమర్ధించుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. యాక్సిస్ పవన–సౌర హైబ్రీడ్ ప్రాజెక్టు నుంచి 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఏపీఎస్పీడీసీఎల్ పాతికేళ్ల పాటు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు పీపీఏ చేసుకోవడం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలను రద్దు చేయగా, నాడు ఏపీఈఆర్సీ సైతం తిరస్కరించిన ఒప్పందాన్ని కూటమి సర్కారు మళ్లీ తెరపైకి తెచ్చి 108 సెక్షన్ పేరుతో బెదిరించి ఆమోదింపచేసుకుంది. ఈ అడ్డగోలు ఒప్పందాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. యాక్సిస్‌తో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్షాలు, మేధావులు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ చార్జీల బాదుడును రద్దు చేయాలని, యాక్సిస్ తదితర బడా కంపెనీలతో కుదుర్చుకున్న అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సోమవారం ప్రజాభేరి కార్యక్రమంలో సంతకాలను సేకరించారు. తక్కువ ధరకే రిలయన్స్ ‘బీబీబీ’.. యాక్సిస్ ఎనర్జీతో అధిక ధరకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమరి్ధంచుకునేందుకు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రయతి్నంచారు. అది హైబ్రీడ్ పైలట్ ప్రాజెక్టు అని.. బండ్లింగ్, బ్యాలెన్సింగ్, బ్యాంకింగ్ (బీబీబీ) విధానంలో ఏర్పాటవుతున్న తొలి ప్రాజెక్టు కాబట్టి ఆ మేరకు ధర కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ సెకీ నిర్వహించిన వేలంలో 930 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పి యూనిట్ రూ.3.53 చొప్పున అందించేందుకు రిలయన్స్ పవర్ ముందుకొచి్చంది. ఇదే బీబీబీ విధానంలో రోజూ నాలుగు గంటల పాటు పీక్ అవర్స్‌లో విద్యుత్‌ను ఇస్తామని రిలయన్స్ చెప్పింది. అయినప్పటికీ తక్కువ ధరకు అందించే రిలయన్స్‌ను కాదని యూనిట్ రూ.4.60కి యాక్సిస్ నుంచే తీసుకోవడానికి కారణం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ‘సెకీ’ విద్యుత్‌పై ‘ఎల్లో’ మీడియా దు్రష్పచారం.. రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు కేంద్ర సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కారుచౌకగా యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేసేలా గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ప్రతిపాదన సెకీ నుంచే వచి్చంది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పిచింది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు దు్రష్పచారానికి పాల్పడ్డాయి. ఈ కుట్రలన్నిటినీ ఏపీఈఆర్సీ పటాపంచలు చేసింది. సెకీతో ఒప్పందం సక్రమమేనని మండలి తేల్చి చెప్పింది. ఇప్పుడు యాక్సిస్‌కు భారీ ధర చెల్లిస్తూ టీడీపీ కూటమి సర్కారు చేసుకున్న ఒప్పందంపై ఎల్లో మీడియా కిమ్మనకపోవడం గమనార్హం.

ఆర్బీఐ ఖజానాలో పసిడి మెరుపులు
ముంబై: పసిడిపై ఆర్బీఐ మోజు కొనసాగుతూనే ఉంది. గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల పసిడిని ఆర్బీఐ కొనుగోలు చేయగా.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 57 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. దీంతో ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు మార్చి నాటికి 879.59 టన్నులకు చేరినట్టు అధికారిక డేటా తెలియజేస్తోంది. ఈ కాలంలో పసిడి ధరలు 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. గత ఏడేళ్లలోనే ఆర్బీఐ అత్యధికంగా పసిడిని గత ఆర్థిక సంవత్సరంలోనే కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిపోయిన తరుణంలో సురక్షిత సాధనమైన బంగారానికి ఆర్బీఐ ప్రాధాన్యం పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఆర్బీఐ పసిడి నిల్వల్లో 512 టన్నులు స్థానిక ఖజానాల్లో ఉంటే, 348.62 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద, మరో 18.98 టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆర్బీఐ తన బంగారం నిల్వల్లో కొంత మొత్తాన్ని స్థానిక ఖజానాలకు మళ్లించడం గమనార్హం. 2024 మార్చి నాటికి స్థానిక నిల్వలు 408 టన్నులే కాగా, గత సెప్టెంబర్ నాటికి 510.46 టన్నులకు పెంచుకుంది. ఫారెక్స్ నిల్వల్లో 11.70 శాతం.. ఇక విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్) బంగారం వాటా 2024 మార్చి నాటికి 9.32% కాగా, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ఇక 2024 సెప్టెంబర్ నాటికి 706 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉంటే, ఈ ఏడాది మార్చి నాటికి 668.33 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇవి 10.5 నెలల దిగుమతుల అవసరాలకు సరిపోతాయి.
పియాస్ట్రిదే పైచేయి.. 1997 తర్వాత ఇదే తొలిసారి...
యూఎన్వో కీలక భేటీలో పాకిస్థాన్‌కు భంగపాటు
Success Story: జస్ట్ 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..!
‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్
పంజాబ్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
చూడటానికి మొక్కజొన్న పంట.. కానీ దగ్గరకెళ్తే షాకవ్వుతారు!
మెట్ గాలాలో మెరిసిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. బేబీ బంప్‌తో ఎంట్రీ!
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
MI vs GT: అందరికీ అప్పుడే.. సిరాజ్‌కు ఇప్పుడు!
వేసవిలో కిచెన్ క్లాసెస్: అప్పుడే చిన్నారులు ఆహార నిర్భర్‌గా..
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
నా కొడుకును సంపేయండి
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
బంగారం భారీగా పడిపోతుంది!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ఇంట్లో పాముల కలకలం
3 నిమిషాలకో మరణం
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
పాక్ నడ్డి విరిగేలా..
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ముష్కర మూకలకు ముచ్చెమటలు
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
పియాస్ట్రిదే పైచేయి.. 1997 తర్వాత ఇదే తొలిసారి...
యూఎన్వో కీలక భేటీలో పాకిస్థాన్‌కు భంగపాటు
Success Story: జస్ట్ 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..!
‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్
పంజాబ్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
చూడటానికి మొక్కజొన్న పంట.. కానీ దగ్గరకెళ్తే షాకవ్వుతారు!
మెట్ గాలాలో మెరిసిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. బేబీ బంప్‌తో ఎంట్రీ!
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
MI vs GT: అందరికీ అప్పుడే.. సిరాజ్‌కు ఇప్పుడు!
వేసవిలో కిచెన్ క్లాసెస్: అప్పుడే చిన్నారులు ఆహార నిర్భర్‌గా..
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
నా కొడుకును సంపేయండి
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
బంగారం భారీగా పడిపోతుంది!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
ఇంట్లో పాముల కలకలం
3 నిమిషాలకో మరణం
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
పాక్ నడ్డి విరిగేలా..
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ముష్కర మూకలకు ముచ్చెమటలు
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
సినిమా

అడవిలో థామా
‘థామా’ సినిమా కోసం దాదాపు నెలపాటు అడవిలో జరిగే షూటింగ్లో పాల్గొంటున్నారట హీరోయిన్ రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ ఈ దీపావళికి రిలీజ్ కానుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఊటీతోపాటు అక్కడి ఫారెస్ట్‌లో జరుగుతోందట.ఆయుష్మాన్, రష్మికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సన్నివేశాల తర్వాత ఆయుష్– రష్మిక– నవాజుద్దీన్ సిద్ధిఖీలపై క్లైమాక్స్ సన్నివేశాలను కూడా ఇదే షెడ్యూల్లో చిత్రీకరిస్తారని బాలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్‌తో ‘థామా’ షూటింగ్ టాకీపార్ట్ దాదాపు పూర్తవుతుందని,పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయని సమాచారం. ఇక మడాక్ ఫిల్మ్స్(నిర్మాత దినేష్ విజన్) హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ‘థామా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

జూన్ లో సితారే జమీన్ పర్
ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘సితారే జమీన్ పర్’. ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించారు. ఆమిర్‌ఖాన్ ప్రోడక్షన్స్పై ఆమిర్‌ఖాన్ , అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ సినిమాని జూన్ 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. వీరందరూ ‘సితారే జమీన్ పర్’ సినిమాతోనే వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. ఆమిర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007) సినిమాకు స్పిరిచ్యువల్ సీక్వెల్‌గా ‘సితారే జమీన్ పర్’ చిత్రం తెరకెక్కిందని, స్పానిష్ ఫిల్మ్ ‘ఛాంపియన్స్’ (2018) ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారని బాలీవుడ్ టాక్. అలాగే దాదాపు మూడేళ్ల తర్వాత ఆమిర్‌ఖాన్ నుంచి వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్లో అంచనాలు నెలకొన్నాయి.

చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!
మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ దొరికేసిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తుంది. చిరు ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. దీనిపై కంటే డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోయే మూవీపై అందరి కళ్లున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఓ యంగ్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఈ ఏడాదికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. చిరంజీవి కోసం ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అని చాలా పేర్లు వినిపించాయి. ఫైనల్ గా ఇప్పుడు ఓ పేరు ఫిక్సయ్యారు. ఆమెనే కేథరిన్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 2013 నుంచి తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న కేథరిన్.. అల్లు అర్జున్ సరసన రెండు మూవీస్ చేసింది. వీటిలో 'సరైనోడు' ఒకటి. ఇందులో ఎమ్మెల్యే పాత్రలో నటించింది. రీసెంట్ టైంలో బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీరయ్య తదితర సినిమాల్లో నటించింది.ఇప్పుడు చిరంజీవి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ అంటే కేథరిన్ ని అదృష్టం వరించినట్లే. ప్రస్తుతానికి ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో మిగతా హీరోయిన్లతో పాటు ఈమె గురించి టీమ్ ప్రకటిస్తారేమో? వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ఈ మూవీ థియేటర్లలో రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా)

ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా 15కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు యాడ్ అయింది. అస్సలు ఇంగ్లీష్ పదాలే వాడకుండా తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుందని ఇప్పుడు చూద్దాం?అందరూ కొత్తవాళ్లతో తీసిన సినిమా 'కాలమే కరిగింది?'. మార్చి 21న ఈ తెలుగు మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ మూవీలో సారీ, థ్యాంక్స్ తప్ప మరే ఇంగ్లీష్ పదాలు ఉపయోగించలేకపోవడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) కథంతా స్కూల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు ఎంచుకున్న లవ్‌స్టోరీ పాయింట్ కొత్తదేమి కాదు. కానీ అప్పటి ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని కవితాత్మకంగా సరికొత్తగా చూపించారు. స్కూల్ డేస్ లోని బాల్యప్రేమను మధురంగా మలిచారు. ఇప్పుడీ చిత్రం మే 09 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.'కాలమే కరిగింది?' విషయానికొస్తే.. ఫణి (వినయ్ కుమార్-అరవింద్) బాగా చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యింటాడు. తొలి ప్రేమ గుర్తొచ్చి ప్రియురాలు బిందు (శ్రావణి-నోమిన తార) కోసం సొంతూరు వెళ్తాడు. అసలు బిందు ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఫణికి బిందు కలిసిందా లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ)
న్యూస్ పాడ్‌కాస్ట్

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.
క్రీడలు

ఎస్ఆర్హెచ్ కొంపముంచిన వరుణుడు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్బుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ రైజర్స్ బౌలర్లు దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం ఖాయమని అంతా భావించారు. సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ బ్యాటింగ్ అనంతరం భారీ వర్షం కురిసింది. దీంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి మైదానం సిద్దం చేసేందుకు దాదాపు గంటకుపైగా సమయం పట్టే సూచనలు కన్పించాయి. దీంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఈ క్రమంలో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 13 పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్దానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలన్న హైదరాబాద్ ఆశలు మాత్రం ఆడియాశలు అయ్యాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి ఇంటిముఖం పట్టింది.

మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. షమీని హత్య చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చిందని అతని సోదరుడు హసీబ్ వెల్లడించాడు. అంతేకాకుండా కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు హసీబ్ తెలిపాడు. ఈ ఘటనపై షమీ సోదరుడు ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సోమవారం ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడతున్నారు. పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో రాజ్‌పుత్ సిందార్ అనే వ్యక్తి ఈ బెదిరింపు ఇమెయిల్ పంపినట్లు గుర్తించారు. కాగా ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా ఇటువంటి బెదిరింపులే వచ్చాయి. ఈ మెరకు ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశాడు. కాగా మహ్మద్ షమీ ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. గాయం నుంచి కోలుకుని ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పర్వాలేదన్పించిన షమీ.. ఐపీఎల్లో మాత్రం తేలిపోతున్నాడు. షమీ ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో 56.17 సగటుతో 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో షమీ భారత తరపున ఆడనున్నాడు.

ప్యాట్ కమ్మిన్స్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన అద్బుత బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ టాపర్డర్‌ను కుప్పకూల్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే కరుణ్ నాయర్‌ను ఔట్ చేసి తన జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఆ తర్వాత మూడో ఓవర్ మొదట బంతికి ఫాఫ్ డుప్లెసిస్, ఐదో ఓవర్ మొదటి బంతికి అభిషేక్ పోరెల్‌ను కమ్మిన్స్ పెవిలియన్‌కు పంపాడు. కమ్మిన్స్ ఓవరాల్‌గా తన 4 ఓవర్ల కోటాలో 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో కమ్మిన్స్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్‌గా కమ్మిన్స్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్ పవర్ ప్లే ఏ కెప్టెన్ కూడా మూడు వికెట్లు సాధించలేకపోయాడు. అక్షర్ పటేల్(ఢిల్లీ క్యాపిటల్స్), జహీర్ ఖాన్(ఢిల్లీ క్యాపిటల్స్), షాన్ పోలాక్(ముంబై ఇండియన్స్) వంటి కెప్టెన్లు ఐపీఎల్ ఇన్నింగ్స్ పవర్ ప్లేలో 2 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్‌తో ఈ త్రయాన్ని కమ్మిన్స్ అధిగమించాడు.మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 7 వికెట్ల నష్టానికి ఢిల్లీ 133 పరుగులు చేసింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీని స్టబ్స్(41 నాటౌట్), ఆశుతోష్ శర్మ(41) ఆదుకున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు, ఉనద్కట్, హర్షల్ పటేల్, మలింగ తలా వికెట్ సాధించారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు సౌతాఫ్రికా కీలక నిర్ణయం
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి 15 వరకు జరగనున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రెండో సారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఆసీస్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా సైతం తొలిసారి ట్రోఫీ ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఫైనల్‌కు ముందు జింబాబ్వేతో సౌతాఫ్రికా నాలుగు రోజుల టెస్టు ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే ఆఖరి వారంలో ఈ మ్యాచ్ జరిగే అవకాశముంది. అదేవిధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నహాకాల్లో భాగంగా ప్రోటీస్ జట్టు జూన్ 3న ససెక్స్‌తో కూడా తలపడనుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. గ్రూపు స్టేజి ముగిసిన తర్వాత కొంతమంది సఫారీ ఆటగాళ్లు నేరుగా ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. మిగిలిన ప్లేయర్లు మే 25న ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా జట్టులో చేరనున్నారు. ఈ ఫైనల్‌కు ముందు మరో గుడ్ న్యూస్ సౌతాఫ్రికాకు అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.అతడు తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. తొలుత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రబాడ దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు నిషేదం ఎత్తేయడంతో సౌతాఫ్రికా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.చదవండి: వయసుతో పనేంటి?.. అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు: వరుణ్ చక్రవర్తి
బిజినెస్

ఆర్బీఐ ఖజానాలో పసిడి మెరుపులు
ముంబై: పసిడిపై ఆర్బీఐ మోజు కొనసాగుతూనే ఉంది. గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల పసిడిని ఆర్బీఐ కొనుగోలు చేయగా.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 57 టన్నుల బంగారాన్ని అదనంగా సమకూర్చుకుంది. దీంతో ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు మార్చి నాటికి 879.59 టన్నులకు చేరినట్టు అధికారిక డేటా తెలియజేస్తోంది. ఈ కాలంలో పసిడి ధరలు 30 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. గత ఏడేళ్లలోనే ఆర్బీఐ అత్యధికంగా పసిడిని గత ఆర్థిక సంవత్సరంలోనే కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిపోయిన తరుణంలో సురక్షిత సాధనమైన బంగారానికి ఆర్బీఐ ప్రాధాన్యం పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఆర్బీఐ పసిడి నిల్వల్లో 512 టన్నులు స్థానిక ఖజానాల్లో ఉంటే, 348.62 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద, మరో 18.98 టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఆర్బీఐ తన బంగారం నిల్వల్లో కొంత మొత్తాన్ని స్థానిక ఖజానాలకు మళ్లించడం గమనార్హం. 2024 మార్చి నాటికి స్థానిక నిల్వలు 408 టన్నులే కాగా, గత సెప్టెంబర్ నాటికి 510.46 టన్నులకు పెంచుకుంది. ఫారెక్స్ నిల్వల్లో 11.70 శాతం.. ఇక విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్) బంగారం వాటా 2024 మార్చి నాటికి 9.32% కాగా, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ఇక 2024 సెప్టెంబర్ నాటికి 706 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉంటే, ఈ ఏడాది మార్చి నాటికి 668.33 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇవి 10.5 నెలల దిగుమతుల అవసరాలకు సరిపోతాయి.

మార్కెట్ సమయాలపై ఆర్బీఐ సూచనలు
ముంబై: ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లకు ప్రస్తుత ట్రేడింగ్ వేళలనే కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ కమిటీ సిఫార్సు చేసింది. కాల్ మనీ మార్కెట్ టైమింగ్స్‌ను మాత్రం రాత్రి 7 గం.ల వరకు పొడిగించాలని సూచించింది.ప్రస్తుతం కరెన్సీ మార్కెట్ల ట్రేడింగ్ వేళలు ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 3.30 గం.ల వరకు ఉంటున్నాయి. అయితే, ఆన్‌షోర్ మార్కెట్ వేళల తర్వాత నాన్ రెసిడెంట్లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహించేందుకు సాయంత్రం 5 గం.ల నుంచి రాత్రి 11.30 గం.ల వరకు ట్రేడింగ్ వేళలు ఉంటున్నాయి.మరోవైపు, కాల్ మనీ మార్కెట్ వేళలు ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు, రెపో మార్కెట్ టైమింగ్స్ ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 2.30 గం.ల వరకు ఉంటున్నాయి.

UPIలో కీలక మార్పులు: జూన్ 16 నుంచే అమలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో కీలక మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ అప్డేట్ చేయనున్నట్లు, ఇది 2025 జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.యూపీఐ వినియోగదారులు.. లావాదేవీలు చేయడానికి కనీసం 30 సెకన్ల సమయం కేటయించాల్సి ఉంది. ఈ సమయాన్ని తగ్గించడానికి NPCI చర్యలు తీసుకుంటోంది. ఇది అమలులోకి వచ్చిన తరువాత.. ట్రాన్సక్షన్స్ మరింత సులభతరం అవుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలులావాదేవీలు, డెబిట్, క్రెడిట్ సేవల కోసం యూజర్ ఇప్పుడు 30 సెకన్ల సమయం వెచ్చించాల్సి ఉంది. దీనిని 15 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీ స్థితిని తనిఖీ చేసే సమయాన్ని 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీలు చేయడానికి సంబంధించిన టైమ్ తగ్గితే.. యూజర్ల సమయం కూడా ఆదా అవుతుంది.

30 మందికి మాత్రమే ఈ కారు: ధర ఎంతో తెలుసా?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జీప్'.. ఇండియన్ మార్కెట్లో రాంగ్లర్ కొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ విల్లీస్ '41 స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 73.24 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కొత్త ఎడిషన్ భారత సైన్యానికి గుర్తుగా స్పెషల్ కలర్ పొందింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితం. అంటే ఈ కారును 30 మంది కస్టమర్లు మాత్రమే కొనుకోలు చేయగలరు. జీప్ రాంగ్లర్ టాప్ స్పెక్ రూబికాన్ వేరియంట్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. 1941 అనే డెకాల్ హుడ్‌పై ఉండటం చూడవచ్చు. ఈ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!కొత్త స్పెషల్ ఎడిషన్ రాంగ్లర్‌లో పవర్డ్ సైడ్ స్టెప్, కొత్త ఇంటీరియర్ గ్రాబ్ హ్యాండిల్స్, వెదర్ ఫ్లోర్ మ్యాట్లు, ఫ్రంట్ అండ్ రియర్ డాష్‌క్యామ్‌లు కూడా ఉన్నాయి. డిజైన్ కొంత కొత్తగా అనిపించినప్పటికీ.. అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 270 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.
ఫ్యామిలీ

నటుడు ధర్మేంద్ర వాటర్ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! ఎలా చేస్తారంటే..
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర(Dharmendra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీలతో వేలాది అభిమానులను సంపాదించుకున్న నటుడు. ఎనిమిది పదుల వయసులో కూడా అంతే అందంగా మంచి ఫిట్నెస్తో ఉంటారు. అంతేగాదు తరుచుగా తన వర్కౌట్ వీడియోలతో ఆరోగ్య స్పృహను కలుగుజేస్తుంటారు. తాజాగా తన గేమ్-ఛేంజర్ వాటర్ వ్యాయామాలతో వీడియోని షేర్ చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచారు. కండరాల కదలికలు కోసం, ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే శారరీక కదలికలకు ఈవ్యాయామాలు మంచి గేమ్ ఛేంజర్ అనిపోస్ట్లో పేర్కొన్నారు 89 ఏళ్ల ధర్మేంద్ర. ఈ నేపథ్యంలో ఆ వ్యాయమాలు ఎలా చేస్తారు..? కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నీటిలో చేసే ఈ సున్నితమైన వాటర్ వ్యాయామాలు శరీరానికి మంచి కదలికలని చెబుతున్నారు నిపుణులు. కాళ్లకు, మొత్తం శరీరానికి మంచిదని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి వ్యాయామాలు తప్పనిసరి అని అన్నారు. ఇలా చల్లటి నీటిలో తేలియాడుతూ చేసే రిలాక్స్డ్ వ్యాయామాలు ఏంటో చూద్దామా..!.వాటర్ వాకింగ్: ఇక్కడ నీటిలో నడవడం బయట భూమిపై నడిచినంత ఈజీగా చేయలేం. కొద్దిమొత్తంలో బలాన్ని ఉపయోగించి నడవాల్సి ఉంటుంది. మన అడుగుపడకుండా చేసే నీటి నిరోధకతతో ఫోర్స్‌గా నడవడం వల్ల మోకాళ్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేగాదు నీటిలోకి దిగి తేలియాడుతూ..స్మిమ్మింగ్‌పూల్ చుట్టూ నడవాలి. దీనివల్ల ఎలాంటి కండర సమస్యలు ఉండవని చెబుతున్నారు నిపుణులు.వాటర్ జాగింగ్: ఇక్కడేంటంటే ఇంకాస్త ముందడుగు వేసి భూమ్మీద చేసినట్లుగా పూల్ చుట్టు జాగింగ్ చేయాలి. దీనివల్ల త్వరితగతిన చెమటలు పట్టేస్తాయి. స్పీడ్‌గా కేలరీలు బర్న్ అవ్వడమే గాక శరీరానికి చక్కని వ్యాయామంలా కూడా ఉంటుంది.ఫ్లట్టర్ కిక్స్: పూల్ సైడ్‌ను పట్టుకుని శరీరాన్ని నిటారుగా ఉంచి.. ఫ్లట్టర్ కిక్ చేయాలి. చల్లటి నీటిలో ఉంటూ కాళ్ళకు తగిన వ్యాయామం అందించే మార్గం. ఇది ఒకరకంగా ఈత కొడుతున్న అనుభూతి కలిగిస్తుంది. .లెగ్ రైజెస్: పూల్ చివరలో నిలబడి కాళ్ళను పక్కకు ఎత్తండి. ఇది హిప్ ఫ్లెక్సర్‌లను బలంగా ఉంచుతుంది. ఇది బాడీకి సూపర్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది.వాటర్ పుష్-అప్లు: పూల్ అంచుపై చేతులను ఉంచి, మోచేతులు వంచి నిలబడండి. ఆ తర్వాత అంచు నుంచి మిమ్మల్ని దూరంగా నెట్టండి, ఆపై నెమ్మదిగా వెనుకకు తగ్గించండి. ఇది అచ్చం పుష్-అప్ చేయడం లాంటిది. అయితే నీటి నిరోధకత పైకి లేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ శరీరాని మంచి కదలికలను అందించడమే గాక కండరాలు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఉపకరిస్తాయి.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగ నిపుణులు లేదా వైద్యులను సంప్రదించండి. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) (చదవండి: ఎంత పనిచేశావ్ నాన్న..! హార్ట్ టచింగ్ వీడియో..)

60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
వ్యాపారవేత్త, దేశీయ అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఆరుపదుల వయసులో కూడా ఫిట్‌గా ఉంటారు. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫిట్నెస్ రహస్యాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. చాలా అలవోకగా యోగాసనాలు వేస్తూ కనిపించారు. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసు కోవాలని ఈ సందర్భంగా మహిళలకు సలహా ఇచ్చారు. 40 ఏళ్లు దాటిన తరువాత ప్రతీ మహిళ తన ఆరోగ్యంపై, శరీరంపై శ్రద్ధ పెట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కూడా. తాజాగా కోచ్ వినోద్ చన్నా నీతా అంబానీ వ్యాయామ పద్ధతులపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.నీతా అంబానీ ఫిట్నెస్ కోచ్ వినోద్ చన్నా, తన అనుభవాన్ని బాలీవుడ్ షాదీస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పంచుకున్నారు . 60 ఏళ్ళ వయసులో కూడా నీతా అంబానీ వ్యాయామానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారంటూ వినోద్ చన్నా ఆమె వ్యాయామ దినచర్య గురించి మాట్లాడారు. తన సలహాలను, సూచనలను తు.చ తప్పకుండా పాటిస్తారని వెల్లడించారు. " నేను నిర్ణయించినట్టే ఆమె వ్యాయామం చేస్తారు.చాలా కష్టపడతారు. వ్యాయామం చేయడానికి సిద్ధంగా ఉంది. నేను ఏమి చెప్పినా, అనుసరించి లక్ష్యాన్ని చేరుకుంటారు" అని చెప్పారు. వినోద్ మార్గదర్శకత్వంలో వివిధ యోగా ఆసనాలు, స్ట్రెచింగ్ ,శ్వాస వ్యాయామాలు చేసిన వీడియోను నీతా ఇటీవల షేర్ చేసిన సంగతి తెలిసిందే.వినోద చన్నా వ్యాయామ సలహాలు50 ఏళ్లు పైబడిన వారు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్న సమయంలో వారి వారి విభిన్న జీవనశైలి, ప్రతిదాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు తమ పోషకాహారాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, కాల్షియం స్థాయి గురించి తెలుసుకోవాలని చెప్పారు. లేదంటే పైకి బాగానే ఉన్నప్పటీ, ఎముకలు పెళుసుగా మారి తొందరగా గాయపడతారని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ కండరాల నిర్మాణం తగ్గుతుంది కాబట్టి పోషకాహారం పరిపూర్ణంగా ఉండాలని, కదలిక లేకపోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది కాబట్టి, మంచి ఆహారం తీసుకోవడం, శక్తి, స్థిరత్వం, మనస్సు,శరీరం మధ్య సమన్వయాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు.చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!ఉదయమా? సాయంత్రమా? ఉదయం లేదా రాత్రి వ్యాయామం చేయాలా వద్దా అని ప్రశ్నిస్తే.. రోజులో ఏ సమయంలోనైనా వ్యాయామం చేయవచ్చని చెప్పారు వినోద్ . శరీరానికి చురుకుదనం, కదలికలే ముఖ్యం అని చెప్పారు. "ఆడ అయినా మగ అయినా వర్కౌట్ వెయిట్ ట్రైనింగ్ అనేది చేతులు, భుజాలు, పొట్ట, వీపు , కాళ్లు వంటి శరీర భాగాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే చురుగ్గా ఉండరో, వారికి భవిష్యత్తులో ప్రతీ విషయంలోనూ సమస్యలొస్తాయి. చురుగ్గా ఉండని వారు ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకి వెయిట్ ట్రైనింగ్‌లో ముందుగా మొబిలిటీ అనేది చూడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుకాగా సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ వినోద్ చన్నా నీతాతోపాటు, ఆమె కుమార్తె ఇషా , చిన్న కుమారుడు అనంత్ అంబానీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, వ్యాపారవేత్త, అనన్య బిర్లా, నటి శిల్పా శెట్టి, జాన్ అబ్రహం, రితేష్ దేశ్‌ముఖ్,ఆయుష్మాన్ ఖురానా ఇతర నటులు కొంతమందికి వినోద్ దగ్గర శిక్షణ పొందిన వారే కావడం విశేషం.

వేంకటేశ్వర సుప్రభాతం@కౌసల్యా.. అని ఆరంభం కావడంలో అంతరార్థం?
కౌసల్యా సుప్రజా రామా ..ఈ సుప్రభాతం ఈ నాటిది కాదు. ఏడువందల సంవత్సరాలుగా గానం చేస్తున్నాం. సుప్రజ అంటే మంచి బిడ్డ. కౌసల్య ముద్దు బిడ్డ ఐన రామా! అని విశ్వామిత్ర మహర్షి పిలుపు.రాముణ్ణి మేల్కొలిపేటప్పుడు కౌసల్య మహర్షికి ఎందుకు గుర్తు వచ్చిందో తెలుసుకుందాం. ఆ అమ్మ పెంపకంలో రాముడు లోకాభిరాముడయ్యాడు. ప్రతిరోజూ ఆమె మేలుకొలుపుతో లోకాన్ని చూసేవాడు. ఆ తల్లిని తలచుకుంటూ... ఆమె ముఖం చూస్తూనే రోజూ నిద్ర లేస్తాడు కౌసల్య ముద్దుబిడ్డ రాముడు. శ్రీ రాముడిలో తల్లి పెంపకంలోని ధైర్యం, కర్తవ్య అవ్యగ్రతలను మహర్షి దర్శించాడు. అందుచేత ఆ పిలుపు. ఆ శ్రీ రాముడే ఆ శ్రీ కృష్ణుడే ఈ కలియుగ వైకుంఠంలో ఆర్త రక్షా దీక్షితుడైన శ్రీ వేంకటేశ్వరుడు అని సుప్రభాత దర్శనం చేసుకొనే పుణ్యాత్ములందరికీ తెలియజేస్తూ మీరు ఆ వైకుంఠుణ్ణే ఈ రూపంలో చూడండి! అని సూచిస్తున్నారు వేంకటేశ్వర సుప్రభాతాన్ని రచించిన ప్రతివాది భయంకర హస్తిగిరి(కంచి) నాథన్ అణ్ణన్ ఆచార్యులు. దశావతారాలతో ఈ భువికి వచ్చిన ఆర్తత్రాణ పరాయణుడూ ఈయనే అని జ్ఞప్తి చేశాడాయన. ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు

ఎంత పనిచేశావ్ నాన్న..! హార్ట్ టచింగ్ వీడియో..
మన టాలెంట్ మన కన్నవాళ్లకి తెలిసినట్టుగా మరెవరకి తెలియదు. మనల్ని మనం నమ్మకపోయినా..మన తల్లిదండ్రులకు మాత్రం అపార నమ్మకం ఉంటుంది. బహుశా ఆ ప్రేమే పిల్లల్ని ప్రయోజకులుగా మారుస్తుందేమో ..!. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇక్కడొక తండ్రి తన కొడుకు టాలెంట్‌ని చూసి సంబరపడటమే కాదు సీక్రెట్‌గా రికార్డు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనసుని టచ్ చేసే ఈ ఘటన ఎవ్వరినైనా కదిలిస్తుంది. ఆ వీడియోలో ఓ బాలుడు మంచం మీద కూర్చొని హాయిగా పాట పాడుతున్నట్లు కనిపిస్తుంది. ఓ పక్కన బ్యాగులో పుస్తకాలు సద్దుతూ..పంజాబీ ఫేమస్ పాట “దో గల్లన్” పాడుతున్నట్లు కనపడుతుంది వీడియోలో. అతడు ఆ పాటని మైమరిచిపోయి పాడుతున్నాడు. పైగా లయబద్ధంగా అందంగా ఆలపించాడు. దాన్ని మొత్తం అతడి తండ్రి తన కుమారుడికి తెలియకుండా రహస్యంగా రికార్డు చేస్తూ. చివర్లో అది చూసి కొడుకు స్టన్ అయిపోతాడు. కాసేపటికి తేరుకుని ఏంటి నాన్న అంటూ మాట్లాడటంతో ముగిసిపోతుంది ఆ వీడియో. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు గుర్తించి..ప్రోత్సహించే పద్ధతి ఇదే అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఏ చిన్నారులకైనా తమలోని టాలెంట్‌కి మొదటి విమర్శకులు తల్లిదండ్రులే..వారు స్పందించే తీరే ఆ రంగంలో పిల్లలు ఎదగడానికి, విజయం సాధించడానికి కారణమవుతుంది కదూ..!. View this post on Instagram A post shared by 🤍☘️ (@_bhangraempire_) (చదవండి: రెండు వేల ఏళ్ల నాటి గ్రామం..! ఒకప్పుడూ నంది వడ్డెమాన్‌గా..)
ఫొటోలు


#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)


కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)


SRH vs DC Photos : ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అభిమానులతో సందడిగా ఉప్పల్ స్టేడియం.. తారల సందడి (ఫొటోలు)


రోజురోజుకీ తమన్నా అందం రెట్టింపు.. చూస్తుంటేనే! (ఫొటోలు)


'#సింగిల్'తో అదృష్టం పరీక్షించుకోనున్న ఇవానా (ఫొటోలు)


హిమాచల్ ప్రదేశ్ లో చిల్ అవుతున్న అరియానా (ఫొటోలు)


శర్వానంద్ సినిమాతో గ్లామర్ బ్యూటీ రీ ఎంట్రీ ఇంతకీ ఎవరు? (ఫొటోలు)


కూకట్‌పల్లిలో సినీనటి కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)


వడగండ్లు.. గాలిదుమారం.. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)


‘దిల్’ రాజు ‘లోర్వెన్ ఏఐ’ స్టూడియో లాంచ్... టాలీవుడ్ ప్రముఖులు సందడి (ఫొటోలు)
అంతర్జాతీయం

ప్రెస్మీట్లో పాక్ జర్నలిస్టుల బూతులు.. వీడియో వైరల్
లండన్: పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులు దారుణంగా ప్రవర్తించారు. విదేశాల్లో మీడియా సమావేశానికి హాజరైన ఇద్దరు పాక్ జర్నలిస్టులు మాత్రం.. పరస్పరం తిట్టుకుంటూ ఏకంగా బూతుపురాణం అందుకున్నారు. పాక్ నేత ప్రెస్‌మీట్ సందర్భంగా జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ సెక్రెటరీ జనరల్ ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన సల్మాన్ అక్రమ్ రాజా లండన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సఫీనా ఖాన్, అసద్ మాలిక్‌తోపాటు పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. సఫీనా ఖాన్ పాకిస్థాన్‌కు చెందిన నియో న్యూస్ ఛానెల్లో పని చేస్తుండగా.. అసద్ మాలిక్, కొందరు ఇతర జర్నలిస్టులు వేర్వేరు చానళ్లలో పని చేస్తున్నారు. వీరంతా ఒక చోట చేరిన సమయంలో సఫీనా, అసద్ మాలిక్ మధ్య వివాదం చోటు చేసుకుంది.ఇద్దరు గొడవకు దిగారు. బూతులు తిట్టుకున్నారు. కుటుంబాలను సైతం దూషించుకున్నారు. అక్కడున్న మిగతా జర్నలిస్టులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం మాలిక్, ఇతర పాక్ జర్నలిస్టులు తనను చంపేస్తామని బెదిరించారని సఫీనా ఖాన్ ట్వీట్ చేశారు. తనకు ఏదైనా జరిగితే ఈ ముగ్గురు రిపోర్టర్లే బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. ఆరోపణలను అసద్‌ఖాన్ తోసిపుచ్చారు. ఇద్దరు జర్నలిస్టుల మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Pakistani Journalism at its peak with journalists Safina Khan and Asad Malik fight it out at a London eatery. (Warning: Very Abusive Content)Delhi boys, take a bow, this language exceeds everything. pic.twitter.com/ZSdMOIpNyj— Ꮙarun (@Ambarseriya) May 4, 2025

ఐరాసలో నేడు పాక్-భారత్ పంచాయితీ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. భద్రతా మండలి(UN Security Council)లో భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించబోతున్నారు. తద్వారా.. అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాల తమ తమ వాదనలు వినిపించే అవకాశం దక్కింది.ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలిగొన్నారు. ఇది పాక్‌పనేనని నిర్ధారించుకున్న భారత్.. అన్ని రకాల ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో.. పాక్ కూడా కౌంటర్ ఆంక్షలు విధిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్ సింధు జలాలను నిలిపివేయడాన్ని ‘‘యుద్ధం’’గానే పాక్ భావిస్తోంది.ఈ క్రమంలో ఈ పరిణామాలపై ఆదివారం పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ తమను(పాక్)ను ఇబ్బంది పెడుతోందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని అన్నారు. మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ అక్రమంగా వ్యవహరిస్తోందని, ఈ విషయాలన్ని భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తుతామని అన్నారాయన.మరోవైపు.. భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశానికి ముందు మండలి ప్రతినిధులు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామని.. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్నామని అన్నారు.

అంతుచిక్కని బంగారం రహస్యం.. పుత్తడి పుట్టిందెక్కడ?
బంగారం. ఈ పేరు వింటేనే భారతీయులు మైమరిచిపోతారు. మనోళ్ల బంగారం మోజు దెబ్బకు పదిగ్రాముల పుత్తడి ధర ఏకంగా రూ.లక్ష మార్కు దాటేయడం తెల్సిందే. పసిడి అంటే సామాన్యులతో పాటు శాస్త్రవేత్తలకు సైతం ప్రత్యేక ఆసక్తి. పుత్తడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు వాళ్లు తెగ ఆసక్తి చూపిస్తారు. ‘‘స్వర్ణం మూలాలెక్కడున్నాయి? బంగారు లోహం భూమ్మీదకు ఎలా వచ్చింది?’’ అన్న ప్రశ్నలు శాస్త్రజు్ఞలను ఎప్పటినుంచో తొలుస్తున్నాయి. పేలిపోయిన నక్షత్రాల నుంచి బంగారం ఉద్భవించిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూట్రాన్ నక్షత్రాలే పుత్తడికి పుట్టిల్లు అని సరికొత్త అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రం తాజాగా ‘ది ఆస్ట్రో ఫిజిక్స్ జర్నల్ లెటర్స్’లో ప్రచురితమైంది. దాదాపు 1,380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్‌బ్యాంగ్ వల్ల విశ్వం ఆవిర్భవించిందన్నది శాస్త్రవేత్తల సిద్ధాంతం. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అత్యంత తేలికైన హైడ్రోజన్, హీలియం, అంతకంటే తక్కువ పరిమాణంలో లిథియం వంటి మూలకాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఆ సమయంలో పేలిన నక్షత్రాలు ఇనుము వంటి కాస్త బరువైన మూలకాలను విశ్వమంతటా వెదజల్లాయి. ఇనుము కంటే సాంద్రత ఎక్కువ ఉండే బంగారం ఎప్పుడు, ఎలా ఉద్భవించిందనే ప్రశ్నకు ‘మ్యాగ్నెటార్’ సరైన సమాధానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏమిటీ మ్యాగ్నెటార్లు? మనకు అతి సమీపంలోని నక్షత్రమైన సూర్యుడు అపారమైన శక్తిని వెలుతురు, ఉష్ణశక్తి రూపంలో నిరంతరం విశ్వంలోకి వెదజల్లుతూనే ఉంటాడు. ఇలా నక్షత్రం తనలోని అపారమైన శక్తినంతా వెదజల్లాక గురుత్వాకర్షణ బలాలను కోల్పోతుంది. దీంతో ఎర్రరంగుకు మారి తుదకు పేలిపోతుంది. దాన్ని సూపర్నోవా అంటారు. పేలిన నక్షత్రం న్యూట్రాన్ నక్షత్రంగా, లేదంటే బ్లాక్‌హోల్ (కృష్ణబిలం)గా రూపాంతరం చెందుతుంది. ఈ న్యూట్రాన్ నక్షత్ర ద్రవ్యరాశి అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో అది గురుత్వాకర్షణ శక్తిని తరంగాల రూపంలో విశ్వంలోకి వెదజల్లుతుంది. వాటితోపాటు ‘గామా’ కిరణాలను, అణు కేంద్రకాలను కూడా అతివేగంగా వెదజల్లుతుంది. దీన్ని ఆర్–ప్రాసెస్ అంటారు. బరువైన మూలకమైన బంగారం ఈ క్రమంలోనే జనించిందని అధ్యయనం విశ్లేషించింది. ‘‘విశ్వంలోని ప్రాథమిక అంశాల పుట్టుక నిజంగా నవ్వు తెప్పించే క్లిష్టతరమైన పజిల్ వంటిది. వాటి పుట్టుపూర్వోత్తరాలను మనం పూర్తిగా కనుక్కోలేం. రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొంటే బంగారం పుట్టిందని గతంలో భావించేవారు. కానీ అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటార్ (న్యూట్రాన్ నక్షత్రం) నుంచి కూడా బంగారం పుడుతోందని అధ్యయనంలో తేలింది’’ అని కొలంబియా వర్సిటీ ఫిజిక్స్ డాక్టోరల్ విద్యారి్థ, పరిశోధన ముఖ్య రచయిత అనిరుధ్ పటేల్ చెప్పారు. 20 ఏళ్ల సమాచారం... ‘‘2017లో రెండు నక్షత్రాలు ఢీకొనడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దాంతో అంతరిక్షంలో అలల్లా గురుత్వాకర్షణ తరంగాలు విస్తరించాయి. వీటితోపాటే గామా కిరణాలు పెద్దమొత్తంలో వెలువడ్డాయి. ఇలా ఢీకొనడాన్ని కిలోనోవాగా పేర్కొన్నారు. దాని ఫలితంగా బరువైన బంగారం, ప్లాటినం, లెడ్ ఏర్పడ్డాయి. అందుకే కిలోనోవాలను బంగారం కర్మాగారాలుగా చెబుతారు. మ్యాగ్నెటార్లు గామా కిరణాలను వెదజల్లినప్పుడే బంగారం పుట్టింది’’ అని లూసియానా స్టేట్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరిక్ బర్న్స్ చెప్పారు.నక్షత్రకంపం! న్యూట్రాన్ నక్షత్రాల్లో అత్యంత కాంతిమయ నక్షత్రాలనే మ్యాగ్నెటార్లు అంటారు. కేవలం టీస్పూన్ సైజులో ఉండే మ్యాగ్నెటార్ ద్రవ్యరాశి కూడా ఏకంగా 100 కోట్ల భూగోళాలంత బరువుంటుంది! మ్యాగ్నెటార్ చుట్టూ అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ క్షేత్రం ఉంటుంది. బిగ్‌బ్యాంగ్ జరిగిన 20 కోట్ల ఏళ్లకే మ్యాగ్నెటార్లు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. భూమి అంతర్గత పొరల్లో సర్దుబాటు వల్ల భూకంపాలు వచి్చనట్టే నక్షత్రంలోనూ నక్షత్రకంపం పుడుతుంది. మాగ్నెటార్ అంతర్భాగంలోని ద్రవరూప పదార్థంలో సర్దుబాటు కారణంగా నక్షత్ర బాహ్యవలయాల్లో ‘స్టార్క్వేక్’లు వస్తాయట.– సాక్షి, నేషనల్ డెస్క్

నిరాఘాటంగా 15 గంటలు విలేకరుల సమావేశం
మాలే: మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు (46) సరికొత్త రికార్డు సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు! ఈ విషయంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. ముయిజ్జు విలేకరుల సమావేశం శనివారం ఉదయం పదింటికి ప్రారంభమైంది. 14 గంటల 54 నిమిషాలపాటు కొనసాగింది. కేవలం ప్రార్థనల కోసం మధ్యలో కాసేపు విరామం ఇచ్చారు. ‘‘దాదాపు 25 మంది విలేకరుల ప్రశ్నలకు ముయిజ్జు విరామం లేకుండా సమాధానాలిచ్చారు.15 గంటల పాటు మాట్లాడి ప్రపంచ రికార్డు నెలకొల్పారు’’ అని మాల్డీవ్స్ ప్రభుత్వం అదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2019 అక్టోబర్‌లో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ 14 గంటల పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అదొక రికార్డుగా నిలిచిపోయింది. అంతకుముందు రికార్డు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషేంకో పేరిట ఉండేది. ఆయన ఏడు గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ముయిజు్టకు ముందు మాల్దీవ్స్ అధ్యక్షుడిగా చేసిన మొహమ్మద్ నషీద్ కూడా ఒక రికార్డు సృష్టించారు. 2009లో ఆయన ప్రపంచంలోనే తొలిసారి సముద్రం అడుగు భాగాన కేబినెట్ సమావేశం నిర్వహించారు! వాతావరణ మార్పులతో సముద్రమట్టం పెరిగిపోతోందని, ఫలితంగా తమ దేశం మునిగిపోయే ప్రమాదముందని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావడానికే ఈ సాహసానికి పూనుకున్నారు.
జాతీయం

అబద్ధాల బురదలో పాక్
న్యూఢిల్లీ: భారత ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తాలేని పాకిస్తాన్ దొడ్డిదారిన పాక్షికంగానైనా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కుట్ర పన్నింది. అందులోభాగంగా తప్పుడు వార్తలను ఆన్లైన్లో కుమ్మరిస్తోంది. భారత ఆర్మీలో సిక్కు సైనికులు, ఉన్నతాధికారులు, సైన్యాధికారులు పాకిస్తాన్‌తో పోరుకు విముఖత చూపుతున్నారని, వాళ్లంతా ఐక్యమై తిరుగుబాటు లేవదీస్తున్నారని ఇష్టమొచ్చిన తప్పుడు కథనాలు వండివార్చి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్చేస్తోంది. భారత సైన్యంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆర్మీలో ఐక్యత దెబ్బతీయడమే లక్ష్యంగా పాకిస్తాన్ సోషల్‌మీడియా వేదికగా అహరి్నశలు పనిచేస్తోంది. ముఖ్యంగా సిక్కు సైనికులపై గురి పెట్టింది. అన్ని రకాలుగా ప్రయత్నాలు పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ అవాస్తవ కథనాల అల్లిక ఎక్కువైంది. పాకిస్తానీ సైనికులకు చెందిన సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి విపరీతంగా ఈ అబద్ధాల ఒరవడి ఊపందుకుంది. సంబంధంలేని, పాత, కృత్రిమమేధ సృష్టించిన విరుద్ద నివేదికలతో అవాస్తవాలను అద్భుతంగా రచించి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. సరిహద్దు వెంట కీలకమైన స్థావరాల వద్ద సిక్కు సైనికులు, సిక్కు అధికారుల వ్యవహార శైలిపై ఓ కంట కనిపెట్టాలని ఇతర మతాలకు చెందిన అధికారులకు భారత ఆర్మీ రహస్య సూచనలు చేసిందని, లీక్ అయిన ఒక నిఘా నివేదికతో ఈ విషయాలు బహిర్గత అయ్యాయంటూ ఒక పేద్ద అసత్య కథనం ఇప్పుడు సోషల్‌మీడియాల్ షేర్ అవుతోంది. దీంతో ఆర్మీ పట్ల సిక్కు సైనికుల్లో విధేయత తగ్గి, సైన్యంలో ఐక్యత లోపిస్తుందని పాకిస్తాన్ భావిస్తోంది. ‘‘భారత ఆర్మీలో ప్రస్తుతమున్న కఠోర వాస్త వం ఇది. సొంత సైనికులనే నమ్మని భారత ఆర్మీ.. పొరుగున పాక్‌తో ఏపాటి యుద్ధం చేయగలదు?’’అని ఒక పాకిస్తాన్ సైన్యాధికారి వ్యాఖ్యానించినట్లు మరో తప్పుడు పోస్ట్ ఇప్పుడు అధికంగా షేర్ అవుతోంది. ‘ఇండియా ఆజ్ తక్’వార్తాసంస్థ ప్రచురించినట్లుగా ఒక తప్పుడు, నకిలీ కథనాన్నీ పాకిస్తానీయులు ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. ధమాకా ఏఐ పేరిట నకిలీ ఏఐ వీడియోలు కృత్రిమమేధతో సృష్టించిన భారతవ్యతిరేక తప్పుడు వీడియోలు ఃధమాకాఏఐ ఖాతా నుంచి షేర్ అవుతున్నాయి. పాకిస్తాన్‌పై యుద్ధం చేయబోమని, ముందుగా ఖలిస్తాన్ విషయం తేల్చాలని, ఇందుకోసం రెఫరెండం నిర్వహించాల్సిందేనని సిక్కు సైనికులు పట్టుబడుతున్నారని ఒక తప్పుడు ఏఐ వీడియోను సృష్టించారు. ‘‘సైన్యంలో వెలుగుచూసిన తిరుగుబాటుతో మోదీ షాక్‌కు గురయ్యారు. సిక్కు శక్తులన్నీ ఏకమయ్యాయి. యుద్ధం చేయబోమని తేల్చిచెప్పాయి’’అని మరో అవాస్తవ వార్త ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. సిక్కు సంబంధ అసత్య వార్తలు, వీడియోలను ఖలిస్తానీ సానుభూతిపరుల ఖాతాల ద్వారా షేర్ చేయిస్తోంది. ఏప్రిల్ 25న సరిహద్దు వెంబడి భారత ఆర్మీలోని వేర్వేరు యూనిట్ల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో ఐదుగురు సైనికులు చనిపోయారని ఒక తప్పుడు వార్త సారాంశం. ఈ ఘటనలో ఒక అత్యున్నత స్థాయి సిక్కు సైన్యాధికారిని మాత్రమే అరెస్ట్‌చేశారని మరో పోస్ట్ ఆన్లైన్లో కనిపిస్తోంది. యుద్ధం చేయాల్సివస్తే మీరు మాత్రం రణక్షేత్రంలోకి కాలుపెట్టొద్దని సిక్కులకు ఖలిస్తానీ వేర్పాటువాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ పిలుపు ఇచ్చినట్లు మరో నకిలీ వీడియో షేర్ అవుతోంది. భారత వైమానిక స్థావరాల గుట్టుమట్లు చెప్పిన వాళ్లకు 1.1 కోట్ల డాలర్ల నజరానా ఇస్తానని గురుపత్వంత్ చెప్పినట్లు ఆ ఏఐ సృష్టించిన వీడియోలో ఉంది. ఇలాంటి వీడియోలు, కథనాలను షేర్‌చేస్తున్న చాలా సోషల్‌మీడియా ఖాతాలను భారత్ ఇప్పటికే నిషేధించి బ్లాక్‌చేసింది. అయితే విదేశాల్లో భారత్ పట్ల వ్యతిరేక భావనను పెంచే ఉద్దేశ్యంతో పలు తప్పుడు వెబ్సైట్ల ద్వారా ఈ కపట కథనాలపరంపర కొనసాగుతోంది.

ఉగ్రవాదులకు స్థానిక స్లీపర్‌సెల్స్ సాయం?
శ్రీనగర్: పహల్గాంలోని బైసారన్‌లో ముష్కరుల కర్కశకాండ వెనుక స్థానిక స్లీపర్‌సెల్స్ హస్తం దాగుందని నిద్రాణంగా ఉండే ఉగ్ర బృందంలోని మాజీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఇలాంటి పలు విషయాలను పంచుకున్నాడు. ‘‘స్థానికంగా ఉండే వాళ్ల నుంచి కనీస సహకారం లేకుండా ఇంతటి దాడి చేయడం అసాధ్యం. దాడిచేసిన లష్కర్ ఉగ్రవాదులతో కనీసం ఐదారుగురు స్థానిక స్లీపర్‌సెల్ సభ్యులు సాయపడి ఉంటారు. సాధారణంగా ఇలాంటి దాడుల్లో కనీసం నెల రోజుల ముందే స్లీపర్ సెల్ సభ్యులను దాడిచేయబోయే ఉగ్రవాదులు సంప్రదిస్తారు. దాడి ఎలా చేయాలి? ఎటు వైపు తప్పించుకోవాలి?లాంటివన్నీ ముందే ప్లాన్ చేస్తారు’’అని మాజీ స్లీపర్‌సెల్ సభ్యుడు చెప్పాడు. ‘‘ఒకవేళ నేనే స్వయంగా శ్రీనగర్‌లో దాడిచేయాలనుకుంటే గుడ్డిగా శ్రీనగర్‌కు వెళ్లను. ముందుగా శ్రీనగర్‌లో దాడిచేయబోయే చోట తరచూ ఎంతమంది భద్రతా సిబ్బంది ఉంటారు అనే ఖచ్చితమైన అంచనా ఉండాలి. ఆ ప్రాంతంపై నాకు అవగాహన ఉండాలి. ఈ అవగాహన మనకు స్లీపర్‌సెల్స్ సభ్యులు కల్పిస్తారు. భద్రతా బలగాలు ఎంత మంది ఉండొచ్చు, దాడికి సఫలమయ్యే అవకాశాలు లాంటివన్నీ వాళ్లే చెప్తారు. తర్వాత ఉగ్రవాదులు రంగంలోకి దిగుతారు. బైసారన్లోనూ ఇదే జరిగి ఉంటుంది’’అని అన్నాడు.గతంలో జైలుకు వెళ్లి.. ఇతను గతంలో స్లీపర్‌సెల్‌లో పనిచేసిన నేరానికి కొన్నేళ్లు జైలులో గడిపి బయటికొచ్చాడు. ‘‘స్లీపర్‌సెల్ సభ్యులు దాడి చేయరు. దాడి చేయబోయే ఉగ్రవాదులకు ఆర్మీ కదలికలపై నిఘా సమాచారం అందిస్తారు. ఉగ్రవాదులకు ఆహారం, ఇతర అత్యయిక అవసరాలు తీరుస్తారు. నేను కూడా గతంలో 2–4 ఏళ్లు స్లీపర్‌సెల్ సభ్యునిగా పనిచేశా. ఉగ్రవాదులకు కావాల్సినవి అందించా. రాత్రిళ్లు తిరిగి సమాచారం సంపాదించి ఇచ్చా. నేను ఇచ్చిన సమాచారంతో వాళ్లు ఎన్నో దాడులు చేశారు’’అని చెప్పాడు. గ్రనేడ్ దాడి ప్రయత్నంలో భద్రతా బలగాలు ఇతడిని అరెస్ట్‌చేశారు. నేరం నిరూపణ అయ్యాక కొంతకాలం జైలు శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. ‘‘ఆనాడు నేను మైనర్‌గా ఉండబట్టే విడుదలయ్యా. అది నా అదృష్టం. లేదంటే ఎప్పటికీ నేను విడుదలకాకపోయే వాడినేమో’’అని అతను అన్నాడు. ‘‘2015 కాలంలో నన్ను ఉగ్రవాదులు రిక్రూట్ చేసుకున్నారు. అప్పట్లో ఫేస్బుక్, వాట్సాప్ యాప్‌లపై నిఘా అంతగా లేదు. అందుకే ఫేస్బుక్లో నాకు మెసేజ్‌లు పంపేవాడు. కొంతకాలానికి నిఘా పెరగడంతో బీబీఎం యాప్‌కు మారా. ఈ యాప్‌లో చేసే వీడియో, వాయిస్ కాల్స్‌ను ఎవరూ కనిపెట్టలేరు’’అని అతను చెప్పాడు. ఉగ్రవాదులతో పనిచేయడం 110 శాతం తప్పు ‘‘స్లీపర్‌సెల్ సభ్యునిగా ఉంటూ చిట్టడవిలోకి వెళ్లి ఉగ్రవాదులకు ఆహారం అందించి రావడం నా తొలి పని. తర్వాతర్వాత ఒక చోట ఉన్న వస్తువును రహస్యంగా మరో చోటుకు చేర్చాల్సి వచ్చేది. నాకు ఈ పనులు పురమాయించే ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే నేను నమ్మకస్తుడినా కాదా అని నిర్ధారించుకునేందుకు నాపై కూడా నిఘా కొనసాగేది. ఇప్పుటికీ నా స్నేహితుల్లో ఇద్దరు ఉగ్రవాదులుగా కొనసాగుతున్నారు. మరో 13–14 మంది స్నేహితులు ఉగ్రవాదులుగా మారి భద్రతా బలగాల ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఏ విధంగా చూసినా ఉగ్రవాదులతో కలిసి పనిచేయడం 110 శాతం తప్పు. నా పదేళ్లగతాన్ని చూసుకుంటే అసలు నేనింకా బతికే ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది’’అని అతను చెప్పాడు.

డీఆర్డీవో, నేవీల ఎమ్ఐజీఎమ్ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: ట్రయల్ రన్లో భాగంగా భారత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ), నేవీలు సంయుక్తంగా ప్రయోగించిన మల్టీ ఇన్ ఫ్లూయెన్స్ గ్రౌండ్ మైన్ పరీక్ష పరీక్ష విజయవంతమైంది. ఈరోజు(సోమవారం) ఎమ్ఐజీమ్(Multi Influence Ground Mine) ను భారత నేవీ, డీఆర్డీవోలు విజయవంతంగా ప్రయోగించినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. The @DRDO_India and @indiannavy successfully undertook combat firing (with reduced explosive) of the indigenously designed and developed Multi-Influence Ground Mine (MIGM). Raksha Mantri Shri @rajnathsingh has complimented DRDO, Indian Navy and the Industry on this… pic.twitter.com/pOvynpBcr5— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) May 5, 2025ఈ మేరకు డీఆర్డీఓకు నేవీ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ వ్యవస్థ భారత నావికాదళం యొక్క సముద్రగర్భ యుద్ధ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

Mock drills: భారత్‌లో మాక్ డ్రిల్.. 1971భారత్-పాక్ యుద్ధ సమయంలో
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. అదే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌ను బుధవారం (మే7న) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. సోమవారం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.అయితే, మాక్ డ్రిల్ నిర్వహించాలని భారత్ - పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లకు కేంద్రం హోం శాఖ సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. Ministry of Home Affairs has asked several states to conduct mock drills for effective civil defence on 7th May.Following measures will be undertaken1.Operationalization of Air Raid Warning Sirens2. Training of civilians, students, etc, on the civil defence aspects to… pic.twitter.com/DDvkZQZw3A— DD News (@DDNewslive) May 5, 2025శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది. వీటితో పాటు క్రాష్ బ్లాక్ అవుట్ రిహార్సల్స్, కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తరలింపు చర్యల సన్నద్ధత ఉండనుంది. గత ఆదివారం ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ ఔట్ రిహార్సల్స్ జరిగాయి. బ్లాక్ ఔట్ రిహార్సల్స్ భాగంగా రాత్రి 9 నుంచి 9:30 వరకు అన్ని లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు.
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

క్రెడిట్ కార్డు బిల్లు కట్టమన్నందుకు..
మదనపల్లె(అన్నమయ్య): క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో, బ్యాంక్ సిబ్బంది ఇంటివద్దకు వచ్చి నిలదీయడంతో అవమానంగా భావించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. వేంపల్లె పంచాయతీ జంగావారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, కాంతమ్మ దంపతుల ఏకై క కుమారుడు శ్రీకాంత్(25) పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన అనిల్‌కు తనపేరుపై ఉన్న క్రెడిట్‌కార్డు ద్వారా రూ.3లక్షల రుణం తీసిచ్చాడు. అయితే, అతను సకాలంలో రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ సిబ్బంది నుంచి వేధింపులు అధికమయ్యాయి. దీంతో తాను వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బులతో పాటు కొంతమేర అప్పుచేసి మూడో వంతు రుణం చెల్లించాడు. ఇంకా రూ.40వేలు చెల్లించాల్సి ఉంది. ఈ నగదు చెల్లింపు కోసం శనివారం బ్యాంక్ సిబ్బంది శ్రీకాంత్ ఇంటివద్దకు వెళ్లి వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేసి నిలదీశారు. దీన్ని అవమానంగా భావించి మనస్తాపంతో ఆదివారం ఉదయం ఇంటివద్దే పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

పాముకాటుకు వివాహిత మృతి
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్‌కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు.

ప్రియురాలి చేతిలో ట్రావెల్ ఏజెంట్ హత్య
అన్నానగర్(తమిళనాడు): మద్యం, మాంసంలో నిద్రమాత్రలు కలిపి దుబాయ్ ట్రావెల్స్ సీఈఓను హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుక్కుడి కి చెందిన త్యాగరాజన్(69) ఇతను కోయంబత్తూరు వచ్చి ఖతీమా నగర్లో నివశించే సమయంలో గోమతి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. గోమతికి నీల, శారద అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో శారదతో గొడవపడిన ఆమె భర్త గుణవేల్ను హత్య చేసి త్యాగరాజన్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై వచ్చాడు. ఈ క్రమంలో శారద పని నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఆ సమయంలో తిరువారూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ సిగమణి(47)తో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. శారదకు, సిగమణికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమస్య వచ్చింది. దీంతో శారద కోవైకి తిరిగి వచ్చింది. శారదను శాంతింపజేసేందుకు సిగమణి 21న కోయంబత్తూరుకు వచ్చాడు. అతనిని శారద తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో త్యాగరాజన్ నెల్లైకి చెందిన ప్రముఖ రౌడీ పశుపతిపాండియన్ సహచరుడు పుదియవన్ కోయంబత్తూరుకు ఆహ్వానించారు. ఆ తర్వాత 22వ తేదీ రాత్రి మద్యం, మాంసంలో 30కి పైగా నిద్ర, నొప్పి నివారణ మాత్రలు కలిపి సిగమణిని హత్య చేశారు. అనంతరం సిగమణి మృతదేహాన్ని త్యాగరాజన్, శారద, పుదియవన్ కారులో తీసుకెళ్లి కరూర్ పొన్నమరావతి పక్కన పడేసి, పారిపోయారు. మిగిలిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దీనిపై సిగమణి భార్య ప్రియా(69) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు బీలమేడు పోలీసులు విచారణ చేపట్టారు. త్యాగరాజన్(69), ఇతని వివాహేతర ప్రియురాలు గోమతి (53), ఆమె కూతుళ్లు నీల (33), శారద (35), కోడలు స్వాతి (26), పుదియవన్(48) సిగమణిని హత్య చేసినట్లు తేలింది. ఆదివారం శారదతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..!
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్‌లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నంచాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్‌పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.
వీడియోలు


సింహాచలం ప్రమాద బాధితులకు పరిహారంలో చంద్రబాబు వక్రబుద్ధి


యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష


ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హొడైడా చమురు నిల్వలు పూర్తిగా ధ్వంసం


AP High Court: కోర్టుకే అబద్ధాలు చెబుతారా?


ఆర్ధిక పరిస్థితిపై మరోసారి చేతులెత్తేసిన తెలంగాణ సర్కార్


తెలంగాణ సర్కార్ తో సమరానికి సై అంటున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు


ఇజ్రాయెల్ REVENGE దెబ్బ గట్టిగా పడింది


రైతుల కోసం కూటమిపై YS జగన్ పోరాటం


పౌరులను అప్రమత్తం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు


సంక్షేమ పథకాల ట్రెండ్ సెట్టర్ గా వైఎస్ జగన్