ముచ్చింతల్‌ సమతా మూర్తి: ఫిబ్రవరి 2 నుంచి సమతా కుంభ్ వేడుకలు

Samatha Kumbh Celebrations From February 2 At Statue Of Equality - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముచ్చింతల్‌తో 216 అడుగుల పంచ లోహ రామానుజాచార్యుల విగ్రహంతో సమతామూర్తి(స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ) కేంద్రం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, సమతామూర్తి కేంద్రం ఏర్పాటై ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఏడాది కావస్తున్నది. ఈ తరుణంలో చిన్న జీయర్‌ కీలక ప్రకటన చేశారు.

ఇక, సోమవారం చిన్న జీయర్‌ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరుగనుందన్నారు. అదే సమయంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమతామూర్తి కేంద్రం గత ఏడాది ఫిబ్రవరి 2న ప్రారంభమైంది.. 216 అడుగుల పంచలోహ విగ్రహం అందుబాటులోకి వచ్చిందన్నారు.

108 దివ్య దేశాలు సమతామూర్తి కేంద్రంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను చూశారు. ఈ ఏడాది కూడా అదే క్రమంలో కార్యక్రమం సాగుతుంది. కాకపోతే ఈ ఏడాది 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నామని వెల్లడించారు. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 11వ తేదీన లక్ష మందితో భగవద్గీత పారాయణం ఉంటుందన్నారు. అలాగే, రామానుజాచార్యులు చాలా మేధావి అంతే కాకుండా మనసు ఉన్న మనస్వి. అన్ని వర్గాల వారిని సమాజంలోకి తెచ్చి ఆలయాల్లో భాగస్వాములను చేశారని అన్నారు. 

ఈ క్రమంలోనే చిన్న జీయర్‌కు భారత అ‍త్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ రావడంపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో చిన్న జీయర్‌ మాట్లాడుతూ.. ముందు రోజు నాకు ఫోన్‌ చేసి.. లిస్టులో మీ పేరు పెడుతున్నామని చెప్పారు. మీకు ఏదైనా అభ్యంతమా? అని అడిగారు. నాకేమీ అభ్యంతరం లేదని నేను వారికి చెప్పాను. పద్మభూషణ్‌ రావాలని నేను కోరుకోలేదు. అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉంది అని కామెంట్స్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top