విజయవాడ మార్గంలో నిలిచిన రైళ్లు | Goods train derails near Khammam Updates | Sakshi
Sakshi News home page

విజయవాడ మార్గంలో నిలిచిన రైళ్లు

Feb 17 2024 1:10 PM | Updated on Feb 17 2024 1:10 PM

Goods train derails near Khammam Updates - Sakshi

విజయవాడ రూట్‌లో రైళ్ల ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. అందుకు కారణం.. 

సాక్షి, ఖమ్మం: వరంగల్‌-విజయవాడ రైలు మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద శనివారం ఉదయం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. 113వ గేటు సమీపంలోకి రైలు రాగానే భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో లోకోపైలట్‌ రైలును నిలిపివేశారు. రెండు బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్‌ నుంచి పక్కకు జరిగినట్లు గుర్తించారు. 

సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే సిబ్బంది వెల్లడించారు. దీంతో కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వీలైనంత త్వరగా పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement