వేర్వేరు వేధింపుల కేసుల్లో ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు వేధింపుల కేసుల్లో ఇద్దరి అరెస్టు

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

తిరువళ్లూరు: పూందమల్లి, తిరువళ్లూరు తదితర రెండు ప్రాంతాల్లో లైగింక వేధింపులకు గురి చేసిన వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్‌కు చెందిన ఏడో తరగతి బాలిక స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి తిరువళ్లూరులోని జెరాక్స్‌ సెంటర్‌కు ఆటోలో బయల్దేరింది. ఈ క్రమంలో ఆటోలో వెళ్తున్న విద్యార్థినిపై డ్రైవర్‌ నందకుమార్‌ అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి దిగినట్టు తెలుస్తుంది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక సింగ పె న్నే టీమ్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన సింగపెన్నే టీమ్‌ ఎస్‌ఐ నిందితుడు నందకుమార్‌ను అదుపులోకి తీసుకుని తిరువళ్లూరు మహిళ పోలీసుస్టేషన్‌లో అప్పగించారు.

పూందమల్లిలో..

ఇంటి వద్ద ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి లైంగిక దాడికి దిగిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపంలోని కన్నిగాపురం గ్రామానికి చెందిన రంగనాధన్‌ కుమారుడు శరవణన్‌(44). ఇతను తన ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న ఏడేళ్ల బాలికకూ మాయమాటలు చెప్పి సమీపంలోని శ్మశాన వాటికకూ తీసుకెళ్లి లైంగిక దాడికి దిగినట్టు తెలుస్తుంది. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూందమల్లి మహిళ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో శరవణన్‌ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు నిర్ధారణ కావడంతో అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement