ఆ కోవలోకి చేరిన సునైనా..? | - | Sakshi
Sakshi News home page

ఆ కోవలోకి చేరిన సునైనా..?

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

తమిళసినిమా: ఇటీవల కాలంలో యువతీయవకులు ప్రేమించుకోవడం, విడిపోవడాలు చాలా ఈజీగా జరిగి పోతున్నాయి. ఇది సాధారణ కుటుంబాల నుంచి అన్ని వర్గాల్లోనూ జరుగుతోంది. అయితే ఫేమ్‌ నేమ్‌ కలిగిన సినీ రంగంలో జరుగుతున్న బ్రేకప్‌ లో గురించి కాస్త ఎక్కువ ఫోకస్‌ ఉంటోంది. అలా సినీ సెలబ్రిటీలలో కొందరు నటీమణుల వరుసలో నటి సునైనా చేరినట్లు తాజా సమాచారం. ముందుగా మోడలింగ్‌ రంగంలో ఎంట్రీ ఇచ్చిన ఈ మహారాష్ట్ర భామ 2005లో తెలుగులో కుమార్‌ వెర్సెస్‌ కుమారి అనే చిత్రంతో కథానాయకిగా పరిచయమయ్యారు. అలా అక్కడ నటిస్తుండగానే ములాయం, కన్నడం భాహల నుంచి అవకాశాలు అందుకుంటున్నారు. అదేవిధంగా కాదలిల్‌ విళిందేన్‌ అనే చిత్రంతో తమిళంలోనూ పరిచయం అయ్యారు. నకుల్‌తో జత కట్టిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఇక్కడ అవకాశం వరుస కట్టాయి. అలా మాసిలామణి ,వంశం, నీర్‌ పార్వై, సమర్‌ వంటి పలు చిత్రాల్లో నటించారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి సునైనా యునైటెడ్‌ అరబ్‌ ఎయిరైట్స్‌కు చెందిన కఖలిత్‌ అల్‌ అమెరి అనే వ్యక్తి ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ వివాహ నిశ్చితార్థం వరకు వెళ్లింది. తాజాగా సునైనా తన ప్రియుడి నుంచి విడిపోయినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వీరిద్దరూ తమ ఫొటోలను తమ ఇన్‌ స్ట్రాగామ్‌ లో నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ ముగిసిందనే ప్రచారం వైరల్‌ అవుతోంది. అయితే ఈ వ్యవహారంపై సునైనా గాని ఆమె ప్రియుడు గాని స్పందించకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement