మర్మాంగాన్ని కోసేసిన రెండో భార్య | The second wife attacked on her husband | Sakshi
Sakshi News home page

మర్మాంగాన్ని కోసేసిన రెండో భార్య

Aug 26 2024 5:17 AM | Updated on Aug 26 2024 5:18 AM

The second wife attacked on her husband

చీమకుర్తి: జీతం డబ్బుల్ని మొదటి భార్యకు పంపుతున్నాడని.. తనను సరిగా పట్టించుకోవడం లేదన్న  కారణంతో మద్యం మత్తులో నిద్రపోతున్న భర్త మర్మాంగాన్ని రెండో భార్య కత్తితో కోసేసిన ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌కు చెందిన విజయ్‌యాదవ్‌కు రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య బిహార్‌లో ఉంటోంది. ఆమెకు నలుగురు పిల్లలు. ఈ క్రమంలో విజయ్‌యాదవ్‌ బిహార్‌లోనే తన గ్రామానికే చెందిన సీతాకుమారిని మూడేళ్ల కిందట రెండో పెళ్లి చేసుకున్నాడు. 

ఆరు నెలల కిందట తొర్రగుడిపాడు వచ్చి  స్థానిక డెయిరీ ఫాంలో రెండో భార్యతో కలిసి పనిచేస్తున్నాడు. అయితే జీతం డబ్బులను మాత్రం బిహార్‌లోని మొదటి భార్యకు పంపిస్తుండటం రెండో భార్యకు ఆగ్రహం తెప్పించింది. చెప్పిన మాట వినకపోవడంతో శనివారం రాత్రి మద్యం మత్తులో నిద్రపోతున్న విజయ్‌ యాదవ్‌ మర్మాంగాన్ని కూరగాయలు కోసే కత్తితో కోసి సీతాకుమారి పరారైంది. జరిగిన సంఘటన డెయిరీఫాం యజమానికి వివరించింది. 

తీవ్రంగా గాయపడిన విజయ్‌యాదవ్‌ను స్థానికులు ఒంగోలు ఆస్పత్రిలో చేర్ఫించారు. దీంతో ఆదివారం ఈ విషయం వెలుగులోకొచ్చి0ది. సీతాకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భిణి కావడంతో ఒంగోలులోని సతీసదన్‌ (మహిళా సంరక్షణ సమితి)లో చేర్ఫించినట్లు  సీఐ సుబ్బారావు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement