పెరిగిన యూనియన్‌ బ్యాంక్‌ లాభం.. రూ.5 డివిడెండ్‌ | Union Bank of India Reports 10pc Jump in Q4 Net Profit Dividend of Rs5 Declared | Sakshi
Sakshi News home page

పెరిగిన యూనియన్‌ బ్యాంక్‌ లాభం.. రూ.5 డివిడెండ్‌

Apr 24 2026 4:57 PM | Updated on Apr 24 2026 5:16 PM

Union Bank of India Reports 10pc Jump in Q4 Net Profit Dividend of Rs5 Declared

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,504 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడానికితోడు ఆస్తుల(రుణాలు) నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 7 శాతం పుంజుకుని రూ. 5,316 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు బ్యాంక్‌ వెల్లడించింది.  

ట్రెజరీ వీక్‌ 
తాజా క్యూ4లో యూనియన్‌ బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 1 శాతం క్షీణించి రూ. 9,406 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు 2.87 శాతం నుంచి 2.64 శాతానికి నీరసించడం ప్రభావం చూపింది. ట్రెజరీ ఆదాయం మందగించడంతో 3 శాతం తక్కువగా రూ. 5,412 కోట్ల వడ్డీయేతర ఆదాయం అందుకుంది. ఈ కాలంలో రుణ నాణ్యత మెరుగుపడటంతో స్లిప్పేజీలు, రుణ వ్యయాలు తగ్గినట్లు బ్యాంక్‌ వెల్లడించింది.

దీంతో ప్రొవిజన్లు 3 శాతం తగ్గి రూ. 2,640 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో ఇవి రూ. 2,715 కోట్లుగా నమోదయ్యాయి. అంతేకాకుండా స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.6 శాతం నుంచి 2.82 శాతానికి దిగివచ్చాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,483 కోట్ల నుంచి రూ. 2,023 కోట్లకు వెనకడుగు వేశాయి. ప్రధానంగా ఎంఎస్‌ఎంఈల నుంచి రూ. 895 కోట్లు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement