హైవేలపై రద్దీని, వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 'ఫాస్ట్‌ట్యాగ్'ను పరిచయం చేసింది. ఆ తరువాత యాన్యువల్ పాస్ తీసుకొచ్చారు. మోసగాళ్లు కూడా.. ఈ సేవలను అందిస్తున్న మోసపూరిత వెబ్‌సైట్‌లను సృష్టించారు. ఈ విషయాన్ని NHAI వెల్లడిస్తూ.. ప్రయాణికులను హెచ్చరించింది.
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌లను విక్రయిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్‌సైట్‌లు, అనధికారిక లింక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. ఈ పాస్‌లు కేవలం అధికారిక రాజమార్గయాత్ర యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈ పాస్‌లను విక్రయించే అధికారం ఇతర ఏ ప్లాట్‌ఫామ్‌లకు లేదు. ఇతర నకిలీ ప్లాట్‌ఫామ్‌లను నమ్మితే.. ఆర్థిక మోసానికి లేదా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. తెలియని లింక్‌లను నమ్మకూడదని ఎన్‌హెచ్‌ఏఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
Attention National Highway Users!
NHAI cautions commuters against fake websites and unauthorised links claiming to sell FASTag Annual Passes. The #FASTagAnnualPass is available only through the official Rajmargyatra App. Any other platform offering the pass is not authorised and… pic.twitter.com/uAaHMCUAR1— NHAI (@NHAI_Official) April 22, 2026
ప్రజలను మోసం చేయడానికి మోసగాళ్లు అసలైన FASTag పోర్టల్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టిస్తున్నారు. అంతే కాకుండా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ వంటివి ఉపయోగించే వాటిని ముందు వరసలో కనిపించేలా చేస్తున్నారు. ఇలాంటి వెబ్‌సైట్‌లను ఓపెన్ చేస్తే.. మొబైల్ నంబర్లు, వెహికల్స్ రిజిస్ట్రేషన్ సమాచారం, చెల్లింపు వివరాలు వంటి సున్నితమైన వివరాలను నమోదు చేయమని కోరతారు. ఇంటర్‌ఫేస్ నిజమైనదిగా కనిపించినప్పటికీ.. ఆ చెల్లింపు మోసగాళ్ల నియంత్రణలో ఉన్న ఖాతాలకు వెళ్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాల్సి ఉంటుందని NHAI హెచ్చరించింది.
ఇదీ చదవండి: యాపిల్ సీఈఓ.. టిమ్ కుక్ సంపద ఎంతో తెలుసా?


