వందేళ్ల నుంచి రైతుల రాకపోకలకు ఉపయోగించే బళ్లబాటకు ప్రస్తుతం నిర్మించిన ప్లాస్టిక్ పరిశ్రమ వల్ల సమస్య వచ్చింది. నిర్మాణ సమయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా సహకరిస్తామని చెప్పి ఇప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
– అడుసుమల్లి నరసింహారావు, రైతు, చేబ్రోలు
పరిశ్రమ నిర్మాణంతో రాకపోకల కోసం ఉన్న బళ్లబాట మూసుకునిపోయి ఇబ్బందులు పడుతున్నామని రైతులు మా దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. కంపెనీ ప్రతినిధులు, రైతులతో మాట్లాడి పొలాల్లో బళ్లబాటకు ఇబ్బందులు లేకుండా అందరితో మాట్లాడి పరిష్కరిస్తాం.
– కె.శ్రీనివాసశర్మ, తహసీల్దార్
ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ వల్ల బళ్లబాట సమస్య, సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. నేను రైతును తోటి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని హమీ ఇచ్చిన కంపెనీ యజమాని నిర్మాణం పూర్తి దశలో మీకు చేతనైంది చేసుకోండి అంటూ అహకారంతో చిన్న చూపుతో మాట్లాడుతున్నాడు. కంపెనీ ముందు ఉన్న సాగునీటి కాలువ మీద సిమెంటు తూము వేసి పూడ్చివేయటంతో సాగునీటి సమస్య ఏర్పడింది. రైతుల వాహనాలు, పంట ఉత్పత్తులు రాకపోకలు సాగించే బళ్లబాటకు ఆటంకం కలిగించే విధంగా ప్రహరీ నిర్మిస్తుండటంతో సుమారు 600ఎకరాల్లోని రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
– శరణం మల్లికార్జునరావు, రైతు, చేబ్రోలు


