న్యూస్‌రీల్
పాలు త్వరగా ఇచ్చేలా పశువులకు నిషేధిత ఇంజెక్షన్ వినియోగిస్తే ఆరోగ్యానికి పలు విధాలుగా అనర్థం అక్రమార్జన కోసం ప్రజారోగ్యంతోనూ చెలగాటం కనీస చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలం
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32.92 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ‘పాల’ నురగ వెనుక కూడా విషం దాగి ఉంటోంది. కొందరి స్వార్థం కోసం పాలను విషతుల్యం చేస్తున్నారు. వారి నిర్వాకానికి పశువులు కూడా వ్యాధుల బారిన పడి కబేళాలకు వెళ్తున్నాయి. వాటి పాలు తాగిన వారు అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. పశుపోషకులు, పాల ఉత్పత్తిదారులు, గేదెల ఫాం యజమానులు పాల దిగుబడుల కోసం అర్రులు చాస్తున్నారు. దీనికోసం ఆక్సిటోసిన్ అనే ఇన్‌జెక్షన్ ఇస్తున్నారు. అది పశుసంపదను నాశనం చేస్తోంది... ప్రజారోగ్యాన్నీ దెబ్బతీస్తోంది.


