సలోని వినతికి ఏపీ సర్కారు ఆమోదం
విజయవాడ: విజయవాడ సబ్‌కలెక్టర్ సలోని సిదాన కల ఫలించింది. మధ్యప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లేందుకు ఆమె పెట్టుకున్న వినతిని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఆమె తన తోటి ఐఏఎస్ ను గత ఏడాది వివాహం చేసుకుంది. వారు రూ. 500 ఖర్చుతో నిరాడంబరంగా వివాహం చేసుకుని అప్పట్లో ఆదర్శంగా నిలిచారు. పంజాబ్ చెందిన సలోని, రాజస్థాన్ కు చెందిన ఆశిష్ ది 2013 బ్యాచ్. ఆశిష్ వశిష్ఠ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని గోహడ్లో ఎస్డీఎంగా పనిచేస్తున్నారు. తనను మధ్యప్రదేశ్ క్యాడర్ కు మార్చాలని ఆమె ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో సలోనిని మధ్యప్రదేశ్ క్యాడర్ కు పంపేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.