యాహూ పేరు మారుతోంది.. కొత్త పేరేమిటంటే! | Yahoo to be named Altaba, Marissa Mayer to leave board after Verizon deal | Sakshi
Sakshi News home page

యాహూ పేరు మారుతోంది.. కొత్త పేరేమిటంటే!

Jan 10 2017 8:56 AM | Updated on Sep 5 2017 12:55 AM

యాహూ పేరు మారుతోంది.. కొత్త పేరేమిటంటే!

యాహూ పేరు మారుతోంది.. కొత్త పేరేమిటంటే!

ఇంటర్నెట​ దిగ్గజ సంస్థగా పేరొందిన యాహూ ఇంక్​ తన పేరును మార్చుకోబోతున్నట్టు సోమవారం ప్రకటించింది.

ఇంటర్నెట​ దిగ్గజ సంస్థగా పేరొందిన యాహూ ఇంక్​ తన పేరును మార్చుకోబోతున్నట్టు సోమవారం ప్రకటించింది. కొత్త పేరుగా ఆల్టబా ఇంక్గా నామకరణం చేయనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా వెరిజోన్ కమ్యూనికేషన్ ఇంక్తో కుదుర్చుకున్న డీల్ ముగిసిన అనంతరం కంపెనీ బోర్డు నుంచి యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెరిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నట్టు వెల్లడించింది. యాహూ తన కోర్ ఇంటర్నెట్ బిజినెస్లు డిజిటల్ అడ్వర్టైజింగ్, మీడియా ఆస్తులు, ఈమెయిల్ వంటి వాటిని ప్రముఖ వైర్లెస్ దిగ్గజం వెరిజోన్కు విక్రయించిన సంగతి తెలిసిందే.  4.83 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ.32,491.41 కోట్లకు యాహు ఇంటర్నెట్ ఆస్తులను వెరిజోన్ కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ డీల్ సమయంలోనే యాహూ సీఈవో మెరిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తాను మాత్రం కంపెనీలోనే ఉండదలుచుకున్నట్టు పేర్కొన్నారు. కానీ డీల్ ముగిసిన అనంతరం ఆమె రాజీనామా చేయనున్నట్టు యాహూ సంస్థనే సోమవారం తెలిపింది. 
 
వెరిజోన్, యాహూతో ఈ డీల్ కుదుర్చుకున్న తర్వాత ఆ కంపెనీలో రెండుసార్లు అతిభారీ మొత్తంలో డేటా చోరి జరిగినట్టు వెల్లడైంది. మొదటిసారి 500 మిలియన్ కస్టమర్ అకౌంట్లు, రెండోసారి 100 కోట్లకు పైగా అకౌంట్లు చోరికి గురైనట్టు తెలిసింది. దీంతో వెరిజోన్ యాహూతో కుదుర్చుకున్న డీల్లో మార్పులు చేయనున్నట్టు లేదా ఆ లావాదేవీలను ఆపివేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యాహూతో తాము బలమైన వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉంచుకోవడానికే చూస్తున్నామని, డేటా ఉల్లంఘనల గురించి ప్రస్తుతం యాహూ విచారణ చేపట్టిందని వెరిజోన్ ఎగ్జిక్యూటివ్లు పేర్కొన్నారు. ఈ డీల్ పూర్తయిన అనంతరం ఐదుగురు యాహూ డైరెక్టర్లు రాజీనామా చేయనున్నట్టు కూడా యాహూ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. మిగతా డైరెక్టర్లు అల్టాబాను పాలించనున్నారని, కొత్త కంపెనీ బోర్డు చైర్మన్గా ఎరిక్ బ్రాండ్ట్ నియమించామని యాహు వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement