ఇంట్లోకి చొరబడి.. కత్తులతో బెదిరించి | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి చొరబడి.. కత్తులతో బెదిరించి

Published Wed, Mar 11 2015 9:21 PM

ఇంట్లోకి చొరబడి.. కత్తులతో బెదిరించి

జవహర్‌నగర్ (హైదరాబాద్): మాస్క్‌లు ధరించిన ఇద్దరు దుండగులు పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న మహిళను కత్తులతో బెదిరించి 8 తులాల బంగారం అపహరించుకుపోయారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. క్రైం ఎస్‌ఐ రవి, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రా సర్కిల్ పరిధిలోని వంపుగూడలో కావలి లక్ష్మణ్‌యాదవ్, కల్పన(38) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఓ కుమార్తె ,ఒక కుమారుడు ఉన్నారు. లక్ష్మణ్‌యాదవ్ సెంట్రింగ్ పనిచేస్తుండగా పిల్లలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.

బుధవారం ఉదయం పనిమీద అందరు బయటికి వెళ్లగా కల్పన ఒంటరిగా ఇంట్లో ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి వెనకభాగంలోని ప్రహరీ దూకిన ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్క్‌లు ధరించారు. డోర్ బాదడంతో కల్పన తలుపులు తీసింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో చంపుతామని ఆమెను బెదిరించారు. కల్పన మెడలో ఉన్న మూడు తులాల రెండు గొలుసులను లాక్కున్నారు. అనంతరం ఆమెతో బీరువా తెరిపించారు. అందులో ఉన్న మరో ఐదు తులాల బంగారం తీసుకొని ఉడాయించారు. సమాచారం అందుకున్న జవహర్‌నగర్ క్రైం ఎస్‌ఐ రవి సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలితో మాట్లాడారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. దుండగులు హిందీ భాషలో మాట్లాడారని బాధితురాలు తెలిపింది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement