విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణకు వినతి | The power to request the amendment of the wage employees | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణకు వినతి

Oct 18 2014 11:58 PM | Updated on Sep 2 2017 3:03 PM

విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ ఉత్తర్వులు వెలువరించాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం మంత్రి హరీష్‌రావుకు

హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ ఉత్తర్వులు వెలువరించాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం మంత్రి హరీష్‌రావుకు విజ్ఞప్తి చేసింది. అచ్చంపేట ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు నేతృత్వంలో సంఘం నేతలు శనివారం మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

విద్యుత్ యాజమాన్యంతో విద్యుత్ జేఏసీ చర్చల ఫలితంగా 27.5 ఫిట్‌మెంట్, మూడు ఇంక్రిమెంట్లు, అలవెన్స్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని, ఈ మేరకు వేతన సవరణ  ఫైలుపై సీఎం సంతకం చేసినా, జీవో విడుదల కాలేదని మంత్రికి వివరించారు. సీఎంతో చర్చించి సమస్యలు పరిష్క రిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement