9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం | rape attempt on ningth class girl | Sakshi
Sakshi News home page

9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం

Jan 2 2015 1:20 AM | Updated on Jul 28 2018 8:51 PM

ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన డిగ్రీ విద్యార్థిపై పోలీసులు ‘నిర్భయ’ కేసు

డిగ్రీ విద్యార్థిపై ‘నిర్భయ’ కేసు నమోదు

కందుకూరు: ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన డిగ్రీ విద్యార్థిపై పోలీసులు ‘నిర్భయ’ కేసు నమోదు చేశారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చెన్నకేశవరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన కడారి మహేష్(23) ఇబ్రహీంపట్నంలో డిగ్రీ చదువుతున్నాడు.

బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన 9వ తరగతి  విద్యార్థిని(14) పాఠశాల నుంచి ఇంటికి చేరుకుంది. బాలిక ఒంటరిగా ఉండడంతో మహేష్ ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారయత్నం చేశాడు. విద్యార్థిని బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు అక్కడికి వచ్చారు. దీంతో మహేష్ అక్కడి నుంచి పారిపోయాడు. గురువారం బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు మహేష్‌పై ‘నిర్భయ’ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెన్నకేశవరాజు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement