పాలమూరుకు..పవర్ ప్రాజెక్టులు | Palamuru power projects | Sakshi
Sakshi News home page

పాలమూరుకు..పవర్ ప్రాజెక్టులు

Sep 7 2014 2:54 AM | Updated on Sep 18 2018 8:37 PM

తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తక్షణ ం కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టాలని ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం పాల మూరు జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టును మొదటి దశలో చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

గద్వాల: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తక్షణ ం కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టాలని ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం పాల మూరు జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టును మొదటి దశలో చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ లోటును భ ర్తీ చేసేందుకు రాష్ట్రంలో నాలుగు వేల మోగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందని విభజన బిల్లులోనే కేంద్రం నిర్ధేశించింది.
 
 ఆ మేరకు త క్షణం రాష్ర్టంలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని శనివారం ఢిలీ ్లలో పర్యటించిన సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర ఇం దన శాఖ మంత్రి పీయూస్ గోయల్ పాల మూరు జిల్లా గద్వాల వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ప్రకటించారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా మొదటిదశలో 1380 మోగా వాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలను తక్షణం చేపడతామన్నారు. మిగతా ప్రాజెక్టులను త్వరలోనే చేపట్టేందుకు ఆయన సుముఖత వ్యక్తం చే శారు.
 
  దీంతో గద్వాల ప్రాంతంలో ప్రతిపాదనలో ఉన్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టుతో పాటు, థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి కదలిక వచ్చినట్లయింది. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులు, జల విద్యుదుత్పత్తికేంద్రాలకు కేంద్రంగా నిలిచిన గద్వాల ప్రాంతం కొత్త ప్రాజెక్టులతో మరింత వేగవంతమైన ప్రగతి పథంలో దూసుకుపోనుంది. గట్టు, ధరూరు మండలాల ప్రాంతంలో కొత్త విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు ప్రభుత్వ పొలాలు అందుబాటులో ఉండడం. జూరాల ప్రాజెక్టు ఆధారంగా అవసరమైర నీటి వనరులు కూడా తొడయ్యాయి. ఇలా గద్వాల తెలంగాణకు వెలుగులను అందించే ముఖ్యమైన ప్రాంతంగా నిలవబోతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement