మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పట్టపగలే చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పట్టపగలే చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. బాదితుని వివరాల మేరకు.. బాల్‌నగర్ మండల జెడ్పీటీసీ పి. ప్రభాకర్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఎస్‌బీహెచ్ నుంచి రూ.5 లక్షల నగదు డ్రా చేశాడు. డబ్బులు కారులో ఉంచి డీఎస్పీ కార్యాలయం సమీపంలోని ఆర్‌డబ్యుఎస్ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయం నుంచి తిరిగి వచ్చే సరికి కారు అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో ఆయన డ్యాష్ బోర్డు తెరిచి చూడగా రూ.5 లక్షలు కనిపించలేదు. దీంతో బాదితుడు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.