
ఆసియా జిమ్నాస్టిక్స్ ‘వాల్ట్’ ఫైనల్లో అరుణ
ఆసియా జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి మహిళల వాల్ట్ ఈవెంట్‌లో ఫైనల్లోకి
హైదరాబాద్: ఆసియా జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి మహిళల వాల్ట్ ఈవెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో క్వాలిఫయింగ్‌లో అరుణా రెడ్డి 13.500 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచింది.
భారత్‌కే చెందిన ప్రణతి నాయక్ 13.200 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్‌లో మొత్తం 46 మంది జిమ్నాస్ట్‌లు పాల్గొనగా... టాప్–8లో నిలిచిన వారు ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నారు.