ఆ ఆరోపణలపై సీబీఐతో విచారణ చేసే దమ్ముందా..?

Is it the case with the CBI to investigate the allegations..?: shabbir ali - Sakshi

హైదరాబాద్ ‌: బీజేపీ సర్కార్‌పై వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేసే దమ్ముందా..? అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ..అమిత్ షా కుమారుడు అజయ్  షా, రాపెల్, విజయ్ మాల్యా, అదాని, ముకేష్ అంబానీ తదితరుల ఆరోపణలపై సీబీఐ విచారణకు అదేశించాలని బీజేపీని కోరారు. సీబీఐ విచారణకు అదేశించి... మీ పాలన పారదర్శకంగా ఉందని నిరూపించుకోండని హితవు పలికారు. మోదీ ప్రధానిగా ఉండి ఎన్నికల నియమావళిని పాటించలేదని, గుజరాత్ ఎన్నికల్లో మోదీ సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లేయించుకున్నారని ఆరోపించారు.

 ఆరేళ్ల క్రితం 2జీ స్కామ్ పై యూపీఏ పై ఆరోపణలు వచ్చాయని, ముఖ్యంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు 2జీ ద్వారా రూ. లక్షా 75 వేల కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. దీని పై కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచారణకు ఆదేశించిందని తెలిపారు. ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న  రాజా, కనిమౌళిలకు సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిందని, కోర్టు జడ్జిమెంటును తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.  సర్కార్ పైసా కేసీఆర్‌ డబ్బాగా తెలుగు ప్రపంచ మహాసభలు జరిగాయని షబ్బీర్‌ అలీ విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top