కబాలితో సమస్యలను ఎదుర్కొంటున్నా | Director Ranjith problems with Kabali movie | Sakshi
Sakshi News home page

కబాలితో సమస్యలను ఎదుర్కొంటున్నా

Aug 14 2016 8:45 PM | Updated on Sep 4 2017 9:17 AM

కబాలితో సమస్యలను ఎదుర్కొంటున్నా

కబాలితో సమస్యలను ఎదుర్కొంటున్నా

కబాలి కారణంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నాననీ ఆ చిత్ర దర్శకుడు రంజిత్ పేర్కొన్నారు.తమిళచిత్రపరిశ్రమలో స్క్రీన్‌ప్లే కింగ్‌గా పెరొందిన నట,దర్శక నిర్మాత కే.భాగ్యరాజ్

తమిళసినిమా; కబాలి కారణంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నాననీ ఆ చిత్ర దర్శకుడు రంజిత్ పేర్కొన్నారు.తమిళచిత్రపరిశ్రమలో స్క్రీన్‌ప్లే కింగ్‌గా పెరొందిన నట,దర్శక నిర్మాత కే.భాగ్యరాజ్ వారసుడు శాంతను కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వాయ్‌మై.ముక్తాభాను నాయకిగా నటించిన ఈచిత్రంలో గౌండ్రమణి,కే.భాగ్యరాజ్,పూర్ణిమా భాగ్యరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఏ.సెంధిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం స్ధానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు.

తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.ధాను అతిధిగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా తొలి ప్రతిని దర్శకుడు రంజిత్ అందుకున్నారు.ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ సమాజిక కట్టుబాటులను ఆవిష్కరించే చిత్రం వాయ్‌మై అని పాటలు,ప్రచార చిత్రాన్ని చూస్తుంటే తెలుస్తోందన్నారు.ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తి నిజాయితీగా జీవించగలడా?అని ప్రశ్నించే ఈ చిత్ర కధను తెరకెక్కించడానికి చాలా ధైర్యం కావాలన్నారు.తొలి చిత్రంతోనే అలాంటి ధైర్యంతో దర్శకుడు ఏ.సెంధిల్‌కుమార్ వాయ్‌మై చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు.

ఇంతకు ముందు దర్శక నటుడు కే.భాగ్యరాజ్ ఇదు నమ్మఆళ్లు చిత్రానికి చాలా సమస్యలను ఎదుర్కొన్నారన్నారు.అదీ సామాజంలోని మూఢ ఆచారాలను తూర్పారబట్టిన కథా చిత్రం అని గుర్తు చేశారు.తాను కబాలి చిత్రంతో అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.ఒక కళాకారుడిగా ప్రజల కోసం సమాజాన్ని,రాజకీయాలను ప్రశ్నించే చిత్రాలను చేయాలన్నారు.విమర్శించేవారు విమర్శిస్తునే ఉంటారనీ దర్శకుడు రంజిత్ వ్యాఖ్యానించారు.
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement