తెలంగాణలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేయడం, మండల, గ్రామస్థాయి కమిటీల నియామకంపై పార్టీ నేతలు చర్చించారు.
హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేయడం, మండల, గ్రామస్థాయి కమిటీల నియామకంపై పార్టీ నేతలు చర్చించారు. పార్టీ కేంద్ర కార‍్యాలయంలో జరిగిన టీవైఎస్ఆర్ సీపీ జిల్లాల వారీ సమీక్షలు బుధవారం ముగిశాయి. పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, ప్రజల సమస్యల గురించి చర్చించినట్టు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని తక్షణం సంపూర్ణంగా అమలు చేయాలని కొండా రాఘవ రెడ్డి డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ పేరుతో ప్రచారానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, నిధుల వ్యయం, పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు.