‘ప్రాసిక్యూషన్’ ఫైళ్లు పెండింగ్ పెట్టొద్దు | don't put 'Prosecution' files in pending | Sakshi
Sakshi News home page

‘ప్రాసిక్యూషన్’ ఫైళ్లు పెండింగ్ పెట్టొద్దు

Apr 26 2014 2:52 AM | Updated on Sep 2 2017 6:31 AM

ఉద్యోగుల ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన ఫైళ్లను పెండింగ్‌లో పెట్టరాదని గవర్నర్ సలహాదారు ఎ.ఎన్.రాయ్ తన పరిధిలోని అన్ని శాఖలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

 గవర్నర్ సలహాదారు రాయ్ ఆదేశాలు

 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన ఫైళ్లను పెండింగ్‌లో పెట్టరాదని గవర్నర్ సలహాదారు ఎ.ఎన్.రాయ్ తన పరిధిలోని అన్ని శాఖలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన కేసుల్లో ఏసీబీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోసం ఉన్న ఫైళ్లను ప్రభుత్వం లేదు కదా అనే ఉద్దేశంతో పలు శాఖలు పెండింగ్‌లో ఉంచుతున్నట్లు రాయ్ దృష్టికి వచ్చింది. దీంతో తన పరిధిలోని శాఖల్లో ఎన్ని ఫైళ్లు ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోసం ఉన్నాయో ఆయన లెక్కలు సేకరించారు. ఆ మేరకు ఆయా శాఖలకు వేర్వేరుగా.. ‘మీ దగ్గర ఇన్ని ప్రాసిక్యూషన్ సంబంధిత ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నారుు..’ అని పేర్కొంటూ వాటిని వెంటనే పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఉద్యోగుల ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కూడా రాయ్ నిర్ణయించారు.

Advertisement

పోల్

Advertisement