రిషితేశ్వరి మృతి కేసులో విచారణ 6కు వాయిదా | Rishiteswari death case: probe adjourned to august 6 | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి మృతి కేసులో విచారణ 6కు వాయిదా

Jul 30 2015 2:27 PM | Updated on Aug 17 2018 2:08 PM

రిషితేశ్వరి(ఫైల్) - Sakshi

రిషితేశ్వరి(ఫైల్)

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణను మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆగస్టు 6కు వాయిదా వేసింది.

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణను మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆగస్టు 6కు వాయిదా వేసింది. ఈ కేసులో శ్రీనివాస్, జయచరణ్, అనీషాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు ముగ్గురు గుంటూరు సబ్ జైలులో ఉన్నారు.

రిషితేశ్వరి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని నినదిస్తున్నారు. ఇందుకోసం ఆమె పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించారు. కాగా, వర్సిటీలో విచారణ కమిటీ ఎదుట హాజరైన రిషితేశ్వరి తల్లిదండ్రులు.. తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement