సిమెంట్ బస్తా మీద పడి కూలీ మృతి | daily wage labour died nellore district | Sakshi
Sakshi News home page

సిమెంట్ బస్తా మీద పడి కూలీ మృతి

Aug 10 2016 10:27 AM | Updated on Sep 4 2017 8:43 AM

సిమెంట్ బస్తా మీద పడి ఎస్‌కే ఖాజా రసూల్(30) అనే యువకుడు మృతి చెందాడు.

నెల్లూరు : సిమెంట్ బస్తా మీద పడి ఎస్‌కే ఖాజా రసూల్(30) అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆత్మకూరు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ గోడౌన్‌లో ఉన్న సిమెంటు బస్తాలను రోడ్డు పనుల నిమిత్తం మోసుకు వస్తున్నాడు. ఆ క్రమంలో కాలు జారి అకస్మాత్తుగా కిందపడ్డాడు.

అతడి గుండెలపై సిమెంట్ బస్తా పడింది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. అక్కడే ఉన్న సహచర కూలీలు అతడిని వెంటనే లేవదీసి... సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆతడి ప్రాణాలు పోయాయని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement