ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నై పర్యటనను నిరసిస్తూ ఓ యువకుడు గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవడం తమిళనాట చర్చనీయాంశమైంది. చెన్నైలోని ఈరోడ్ కి చెందిన ధర్మలింగం... కావేరి జలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరాశకు లోనయ్యాడు. కావేరి బోర్డు ఏర్పాటుపై ప్రధాని స్పందికపోవడంతో మోదీ పర్యటన నిరసిస్తూ శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.