భార్యాభర్తలపై దాడి..కేసు నమోదు | TDP Leader Attack On Wife And Husband At Badvel | Sakshi
Sakshi News home page

భార్యాభర్తలపై దాడి..కేసు నమోదు

Feb 23 2019 8:33 AM | Updated on Mar 22 2024 11:13 AM

పట్టణంలోని తెలుగుగంగకాలనీలో నివసిస్తున్న భార్యాభర్తలపై శుక్రవారం ఓ స్థలవివాదంలో అధికారపార్టీకి చెందిన నేతతో పాటు మరికొందరు దాడిచేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగుగంగకాలనీలో నివసిస్తున్న తుమ్మలూరుసరస్వతి, వీరభాస్కర్‌రెడ్డిలు ఇంటిలో ఉండగా మధ్యాహ్నం సమయంలో వారి ఇంటి పక్కనే ఉన్న స్థలంలో ట్రాక్టర్‌తో రాళ్లు తోలుతుండగా సరస్వతి అడ్డుకుంది. ఈ స్థలంపై కోర్టులో కేసు నడుస్తోందని, ఇక్కడ రాళ్లు ఎలా తోలుతారని ప్రశ్నించి అక్కడి నుంచి ట్రాక్టర్లను పంపించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement