టీమిండియా స్టార్ ఆటగాడు, టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. శనివారం విరాట్ సరిగ్గా 28 వసంతాలు పూర్తిచేసుకుని 29వ వసంతంలోకి ప్రవేశించాడు. అయితే ఆ రోజు కోహ్లీ ముందుగా తన ప్రియురాలు అనుష్కతో కలిసి జాలీగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. గత కొన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్నారన్న వదంతులకు కోహ్లీ, అనుష్క జంట మరోసారి చెక్ పెట్టింది. శనివారం సాయంత్రం టీమిండియా సమయక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను మొదలుపెట్టాడు. టీమిండియా అధికారిక ఫేస్ బుక్ లో నిన్న రాత్రి పోస్ట్ చేసిన కోహ్లీ పుట్టినరోజు వేడుకల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేవలం 11 గంటల వ్యవధిలోనే దాదాపు 30 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు.