భారత్‌ హ్యాట్రిక్‌ విజయం | India win a hat-trick in hockey | Sakshi
Sakshi News home page

Dec 13 2016 8:46 AM | Updated on Mar 21 2024 6:42 PM

జూనియర్‌ ప్రపంచకప్‌ హాకీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌ అందుకు తగ్గట్లే అంచనాలను మించి దూసుకెళుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 2–1తో జయభేరి మోగించింది. పూల్‌ ‘డి’లో వరుసగా మూడో విజయంతో పూల్‌ టాపర్‌గా నిలిచింది. ఈనెల 15న జరిగే క్వార్టర్‌ ఫైనల్లో స్పెయిన్ తో భారత్‌ తలపడుతుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆరంభం నుంచి చెలరేగి ఆడారు. టీమిండియా తరఫున కెప్టెన్ హర్జీత్‌ సింగ్‌ (11వ ని.లో), మన్ దీప్‌ సింగ్‌ (55వ ని.లో) చెరో గోల్‌ చేశారు. ఈ పూల్‌ నుంచి భారత్‌తో పాటు ఇంగ్లండ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత పొందింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement